Tollywood Updates: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) గోవాలో నిర్వహించిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొని భారీ పారితోషికం అందుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేవలం ఆరు నిమిషాల స్టేజ్ డ్యాన్స్ కోసం ఆమెకు సుమారు రూ.6 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే ఒక్క నిమిషానికి దాదాపు రూ.1 కోటి పారితోషికం అన్నమాట.
Read also: Kalyani Priyadarshan: రణ్‌వీర్ సింగ్ తో జోడి కట్టనున్న కళ్యాణి?

ఇటీవల ‘జైలర్’ సినిమాలోని ‘కావాలయ్యా’, అలాగే ‘స్త్రీ 2’లోని ‘ఆజ్ కి రాత్(Aaj Ki Raat)’ స్పెషల్ సాంగ్స్‌కు లభించిన భారీ స్పందనతో తమన్నా డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని తెలుస్తోంది. ఈ పాటలు ఆమెను దేశవ్యాప్తంగా మరింత క్రేజ్ ఉన్న పెర్ఫార్మర్‌గా నిలిపాయి.
ప్రస్తుతం కార్పొరేట్ ఈవెంట్లు, వెడ్డింగ్ ఫంక్షన్స్, లైవ్ స్టేజ్ షోల కోసం తమన్నాను ఆహ్వానించేందుకు నిర్వాహకులు పెద్ద మొత్తంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమాలతో పాటు స్పెషల్ అప్పియరెన్స్‌లు, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌ల ద్వారా తమ ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్న తమన్నా, దేశంలోని హైయెస్ట్ పెర్ఫార్మింగ్ ఆర్టిస్టు(Highest Performing Artist)ల్లో ఒకరిగా మారుతున్నారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: