కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య (Surya) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. ఇప్పటికే ఆర్జే బాలాజీ డైరెక్షన్‌లో కరుప్పు సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మరోవైపు సూర్య 47 ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టాడు. ఈ చిత్రానికి మాలీవుడ్ మూవీ ఆవేశం ఫేం జీతూ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘Suriya 47’ అనే వర్కింగ్ టైటిల్ తో సూర్య కొత్త చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.
Read Also: Palash Muchhal: స్మృతితో పెళ్లి రద్దుపై స్పందించిన పలాశ్ ముచ్చల్..
ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది చిత్ర బృందం
చెన్నైలో గ్రాండ్ గా జరిగిన ‘Suriya 47’ మూవీ ఓపెనింగ్ సెర్మనీకి సూర్య, నజ్రియా, నస్లెన్ తో పాటుగా దర్శక నిర్మాతలు, సంగీత దర్శకుడు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది. జగరమ్ స్టూడియోస్ సమర్పణలో రూపొందనున్న ఈ సినిమా నిర్మాణంలో సూర్య (Surya),
జీతూ మాధవన్ కూడా భాగం పంచుకుంటున్నారు. మలయాళంలో యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఫహద్ ఫాసిల్ (Fahad Fasil) హీరోగా జీతూ మాధవన్ తెరకెక్కించిన ‘ఆవేశం’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. మరి జీతూ మాధవన్ సూర్యతో సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: