సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వంటి హాలీవుడ్ సూపర్ హీరో కథలకు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా టాలీవుడ్‌లోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఆ కోవలోకే మరో సూపర్ హీరో కథ వస్తోంది. కాకపోతే ఈసారి హీరో కాదు, హీరోయిన్ ప్రధాన పాత్రలో ఉంది. సూపర్ మ్యాన్ చెల్లెలి పేరుతో ‘సూపర్‌గర్ల్’ సినిమా థియేటర్లకు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదలైంది.
Read Also: Rajinikanth 75 birthday : రజినీకాంత్ 75 ఆయన ఇష్టపడే వంటలు ఏంటో తెలుసా?…

యాక్షన్, ఫన్ మేళవింపులో మిల్లీ ఆల్కాక్ ప్రదర్శన
ట్రైలర్ చూస్తే, సూపర్‌మ్యాన్ (Superman) తరహాలోనే ఫన్నీ మోమెంట్స్ మరియు జోక్స్ ఉన్నప్పటికీ, ఆపద వచ్చినప్పుడు తన సూపర్ పవర్స్‌ని ఉపయోగించి సమస్యలు పరిష్కరించే సూపర్ గర్ల్ (Supergirl) పాత్రను మిల్లీ ఆల్కాక్ అద్భుతంగా ప్రదర్శించింది. యాక్షన్ సీన్స్ కూడా ఎక్కడా తగ్గకుండా, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా చూపించారు. సూపర్ గర్ల్ పాత్ర, యాక్షన్, ఫన్నీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్ రిలీజ్‌తోనే సినిమాపై హైప్ మొదలైపోయింది.
డీసీ స్టూడియోస్ నిర్మాణంలో 2026 రిలీజ్
ఈ సినిమాను డీసీ స్టూడియోస్ మరియు వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనా నొగ్వేరా దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2026 జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది ఇంగ్లీష్‌తో పాటు తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషలలో కూడా విడుదల కానుంది. ఫన్నీ, యాక్షన్, సూపర్ పవర్స్ అన్నీ కలసిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: