మీరు హారర్ సినిమాలు, థ్రిల్లర్లు ఇష్టపడతారా? అనుక్షణం సస్పెన్స్, ఊహించని మలుపులు, భయంకరమైన దృశ్యాలతో కూడిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దాదాపు 2 గంటల 19 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. హారర్ జానర్ చిత్రాలపై ఇటీవల ఓటీటీల్లో పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ (Sumathi Valavu Movie)సినిమాను కూడా ఆదరిస్తున్నారు.
Read Also: India Post: 24 గంటల్లో సూపర్ ఫాస్ట్ డెలివరీ

సుమతి వలవు’ ప్రత్యేకతలు:
ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ హారర్ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
- సినిమా పేరు: సుమతి వలవు
- జానర్: హారర్ కామెడీ డ్రామా (ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు)
- దర్శకత్వం: విష్ణు శశి శంకర్
- కథ: అభిలాష్ పిళ్లై
- నటీనటులు: అర్జున్ అశోకన్, గోకుల్ సురేష్, సైజు కురుప్, బాలు వర్గీస్, మాళవిక మనోజ్ తదితరులు.
- విడుదల: 2025 ఆగస్టు 1న థియేటర్లలో విడుదలై, సెప్టెంబర్ 26న జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం:
ఈ మలయాళ చిత్రం కథాంశం కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని మాయలముడు గ్రామంలోని “సుమతి వలవు” (Sumathi Valavu Movie) అనే ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. 1950లలో, సుమతి అనే గర్భిణీ స్త్రీని ఆమె ప్రేమికుడు ఆ ప్రదేశంలో హత్య చేశాడని స్థానికంగా చెబుతారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం దయ్యాలు ఉన్న ప్రాంతంగా మారిందని, ఆ దయ్యాన్ని ఎదుర్కొన్న కొందరు వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే ఈ సినిమా కథాంశం.
సినీ రంగానికి మేలు:
ఈ చిత్రం మలయాళంలో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన 9వ చిత్రంగా నిలిచింది. ఈ మూవీకి IMDb లో 7.8/10 రేటింగ్ లభించింది. సినిమాలోని సినిమాటోగ్రఫీ, అద్భుతమైన నేపథ్య సంగీతం, భయానక సన్నివేశాలు, అలాగే కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: