ఈ మధ్యకాలంలో ఓటీటీ అనేది కేవలం వినోద వేదిక మాత్రమే కాదు, అనేక భాషల్లోని కథలు మన ముందుకు తీసుకొచ్చే వేదికగా మారింది. ప్రతి వారం ఓ కొత్త వెబ్ సిరీస్, సినిమా మనల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అలాంటి ఓ ఆసక్తికరమైన తెలుగు సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పేరు ‘దేవిక & డానీ (‘Devika & Danny’).ఇది ఓ రొమాంటిక్ థ్రిల్లర్. కథ, స్క్రీన్ ప్లే, పరిచయాలు అన్నీ కొత్తగా, నేటి యువతకు నచ్చేలా ఉన్నాయి. ఈ సిరీస్‌ను కిశోర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ‘పెళ్లి చూపులు’తో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రీతూ వర్మ ఇందులో దేవిక అనే ప్రధాన పాత్రలో (Ritu Varma plays the lead role of Devika in this )కనిపించబోతున్నారు.

కథ ఏంటి అంటే…
గ్రామీణ నేపథ్యం ఉన్న ఈ కథలో కథానాయిక దేవిక. సాధారణ పల్లె అమ్మాయిలా స్వచ్ఛమైన మనసు, జీవితంపై ఎన్నో కలలు కలిగి ఉంటుంది. అదే సమయంలో డానీ అనే యువకుడు ఆ ఊరికి వస్తాడు. అతను రావడంతో ఆమె జీవితంలో పెద్ద మలుపు తిరుగుతుంది. ఆ మార్పు ఆనందానిదా? ఆందోళనానిదా? అనే ఆసక్తిని కలిగించేలా కథ సాగుతుంది.
నటీ నటులు ఎవరు?
ఈ సిరీస్‌లో రీతూ వర్మ (Reethu Varma) తో పాటు శివ కందుకూరి, సూర్య వశిష్ట, సుబ్బరాజు, అభినయ, గోపరాజు రమణ, శివన్నారాయణ, సోనియా సింగ్ వంటి ప్రతిభావంతులైన నటులు నటించారు. పాత్రలు బలంగా ఉండటమే కాక, నటుల ఎంపిక కూడా చక్కగా సాగింది.
ఎప్పుడు చూడొచ్చు?
జూన్ 6 నుంచి ఈ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రానుంది (The series will be streaming on OTT from June 6th) . ప్రత్యేకంగా తెలుగువారికి రొమాన్స్‌తో పాటు థ్రిల్ కూడా ఇవ్వగల కథ ఇది. సాఫ్ట్ లవ్ స్టోరీలు, సస్పెన్స్ మోడర్న్ టచ్ తో ఉండాలని కోరుకునే వారికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది.ఈ సిరీస్ అందంగా చిత్రీకరించబడిన గ్రామీణ దృశ్యాలు, పల్లెటూరి నైసర్గిక వాతావరణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సహజమైన పాత్రలు, నేటి యువత ఆలోచనలతో మిళితమైన స్క్రిప్ట్ ఇది. ఈ కథను చూస్తే పల్లె సంబరాల్లో మునిగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది.
Read Also : Mohan Babu : మనవరాళ్లపై మోహన్ బాబు ఆసక్తికర ట్వీట్