తెలుగు సినీ పరిశ్రమ (Telugu film industry) లో 1980వ దశకం నిజంగా ఒక స్వర్ణయుగంగా గుర్తించబడుతుంది. ఆ కాలంలో దక్షిణాది సినిమాల్లో అనేకమంది హీరోలు, హీరోయిన్లు రంగప్రవేశం చేసి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు.
Nayanthara: మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు నయనతార పారితోషికం ఎంతంటే?
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, శరత్‌కుమార్ వంటి స్టార్ హీరోలు, సుహాసిని, రాధ, భానుప్రియ, రేవతి, ఖుష్బూ, మీనా వంటి నటీనటులు ఆ దశకంలో తెరపై తమ ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు ని చేశారు. వారి నటన తో ప్రేక్షకులను మంత్రముగ్ధులు ని చేశారు.
అందరూ ఒకే డ్రెస్ కోడ్‌లో దుస్తులు ధరించడం విశేషంగా చెప్పుకోవాలి. చిరంజీవి క్రమంగా తప్పకుండా ఏటా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు.‘1980లలో నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుండి నాతో పాటు ప్రయాణించిన నా ప్రియమైన స్నేహితులతో ప్రతి రీయూనియన్ ఒక జ్ఞాపకాల వీధిలో నడకలా ఉంటుంది.
వెటకారంగా ట్వీట్లు
నవ్వులు, ఆప్యాయత, ప్రేమ దశాబ్దాలుగా మనం పంచుకున్న విడదీయరాని బంధంతో నిండి ఉంటుంది. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు.. ఇంకా ఎన్నో స్మృతులు సృష్టించుకుందాం’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి (Chiranjeevi) ట్వీట్‌కి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
సీనియర్ యాక్టర్లందరినీ ఒకేచోట చేస్తుంటే కన్నుల పండువగా ఉందని అంటున్నారు. మరికొందరేమో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ని బాగా మిస్ అవుతున్నామంటూ వెటకారంగా ట్వీట్లు చేస్తున్నారు.ఈ రీయూనియన్ మొదటిసారి 2009లో చెన్నైలో ప్రారంభమైంది.
మొదటిసారి 2009లో చెన్నైలో ప్రారంభమైంది
అప్పటినుంచి ప్రతి ఏడాది వివిధ నగరాల్లో ఈ వేడుక నిర్వహిస్తున్నారు. మొదట ఇది కేవలం దక్షిణాది హీరోలతో ప్రారంభమైనా తర్వాత అన్ని భాషల సీనియర్ నటీనటులు (Senior actors) చేరడంతో ఇది ఒక సాంస్కృతిక వేడుకగా మారింది.
ఇప్పుడు ఈ రీయూనియన్ దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక సంప్రదాయంగా నిలిచింది. స్టార్‌డమ్ రావొచ్చు పోవచ్చు కానీ స్నేహబంధం మాత్రం ఎప్పటికీ చెదరదని ఈ సీనియర్ నటీనటులు నిరూపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: