మెగాస్టార్ చిరంజీవి 69 ఏళ్ల వయసులోనూ ఎనర్జీని ఏమాత్రం తగ్గించకుండానే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విశ్వంభర చిత్రంలో నటిస్తుండగా, దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నారు. అంతేకాదు, ఇంకా కొన్ని కొత్త సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ఉన్నారు.

రీరిలీజ్ ట్రెండ్ బూమ్
ఇటీవల సౌత్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒకప్పుడు పెద్దగా సక్సెస్ కాలేకపోయిన సినిమాలు కూడా రీరిలీజ్ అయ్యి ఇప్పుడు భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి. ఈ క్రేజ్‌ని ఆస్వాదించేందుకు ఫ్యాన్స్ థియేటర్లకు పరుగులు పెడుతున్నారు.
19 ఏళ్ల తర్వాత స్టాలిన్ మళ్లీ
ఇప్పుడు అదే ట్రెండ్‌లో భాగంగా చిరంజీవి (Chiranjeevi) నటించిన స్టాలిన్ సినిమా (Stalin Movie) మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 2006లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ చిత్రం మళ్లీ ప్రేక్షకులను అలరించబోతోంది.
విడుదల తేదీ అధికారికంగా ఫిక్స్
స్టాలిన్ (Stalin Movie) రీరిలీజ్ గురించి స్వయంగా చిరంజీవి ప్రకటించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాను రీరిలీజ్ (film re-released on August 22nd) చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం నిర్మాతగా వ్యవహరించిన తన తమ్ముడు నాగబాబు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా, ఖుష్బూ చిరంజీవి సోదరిగా కనిపించారు. మణిశర్మ అందించిన సంగీతం అప్పట్లోనే సూపర్ హిట్ అయింది. పాటలు ఈ రోజుకీ ఫ్యాన్స్‌కు గుర్తుండిపోయేలా ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: