ఫేమ్ వచ్చిందంటే ఫాలోయింగ్ పెరుగుతుంది కానీ అప్పుడప్పుడూ ఆ అభిమానమే ఓ హద్దును దాటి వేధింపులుగా మారుతుంది. తాజాగా ఈలాంటి ఘటన శ్రీలీలకు ఎదురైంది.షూటింగ్ ముగించుకుని తిరిగొస్తుండగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తోంది.ఆమె హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ నిమిత్తం టీమ్ మొత్తం డార్జిలింగ్ వెళ్లింది.షూటింగ్ పూర్తయ్యాక, కార్తీక్ ఆర్యన్‌తో కలిసి శ్రీలీల తిరిగొస్తుండగా, అక్కడ అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి చుట్టుముట్టారు.కార్తీక్ ఆర్యన్ తన అభిమానులను చూస్తూ చిరునవ్వుతో ముందుకు సాగాడు. శ్రీలీల కూడా అతడిని ఫాలో అవుతూ హాయిగా వెళ్తోంది.కానీ గుంపులో ఉన్న కొందరు ఆకతాయిలు ఆమె చేయి పట్టుకుని లాగారు. ఇది చూసిన ఆమె ఒక్కసారిగా షాక్‌కి గురైంది.వెంటనే స్టాఫ్ అక్కడకు చేరుకుని ఆమెను బాగానే కాపాడారు.ఈ ఘటన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వీడియో చూస్తూనే నెటిజన్లు మండిపడుతున్నారు. శ్రీలీలను ఇలా బెదరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అభిమానమంటే ఇదేనా? సెలబ్రిటీలకూ ప్రైవసీ అవసరమని స్పష్టంగా చెబుతున్నారు.అభిమానుల ప్రేమ మేలు చేస్తే, మితిమీరిన ప్రేమ సమస్యలు తెస్తుంది. ఏ హీరో అయినా, ఏ హీరోయిన్ అయినా… వాళ్లూ మనవల్లే వెలుగులోకి వచ్చారు.అందుకే అభిమానంగా ఉండాలి గానీ, అశ్లీలంగా ప్రవర్తించకూడదు.ఈ ఘటనపై శ్రీలీల నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా.ఆమె భద్రతపై మాత్రం సినీ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. బహిరంగ ప్రదేశాల్లో భద్రత అవసరమన్నది స్పష్టమవుతోంది.అభిమానులు అభిమానంగా ఉండాలి, వ్యక్తిగతంగా తలదూరకుండా ఉండాలి అన్నది ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.
READ MORE : Donald Trump : కుప్పకూలిన అమెరికా స్టాక్ మార్కెట్ : సుంకాల దెబ్బ