పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’ (Spirit Movie) షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాలతో వెరైటీ నారేషన్‌ను చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా—ప్రభాస్ కాంబినేషన్‌లో చిత్రం రావడంతో సినీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగుతున్నాయి.
Read Also: Piracy: ఐబొమ్మ క్లోజ్ అయినా… దేశలో పైరసీ ఉధృతి ఆగలేదు

‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభం
నేడు జరిగిన ముహూర్త కార్యక్రమంతో చిత్రం అధికారికంగా షూటింగ్ స్టార్ట్ అయింది.‘స్పిరిట్’ (Spirit Movie) టీమ్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ ముహూర్తపు పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రత్యేక అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి క్లాప్‌తో తొలి షాట్‌ను చిత్రీకరించినట్లు సమాచారం.ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి (Tripti Dimri) నటిస్తున్నారు.
అలాగే కీలక పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ (T-Series), సందీప్ రెడ్డి వంగా, మరియు ప్రణయ్ రెడ్డి వంగా (Bhadrakali Pictures) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ సంస్థలు ప్రమోషన్స్‌లో భాగంగా #OneBadHabit అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: