తమిళ సినీ రంగంలో యువ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan), తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘మదరాసి’ (Madharaasi) సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. గతంలో ‘అమరన్’ (‘Amaran’) వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శివ కార్తికేయన్, ఇప్పుడు ఈ సినిమా ద్వారా మరోసారి తన మార్కెట్ ని నిరూపించుకున్నాడు.
Bigg Boss 9: వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో మరింత ఆసక్తి గా హౌస్
మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే కాకుండా రూ.80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ చిత్రం అక్టోబర్ 01నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
కథేంటంటే
ఇందులో డెల్యూజన్ డిజార్డర్ (బాధలో ఉన్న అందరూ తన ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని బాధ పడటం)తో సతమతమయ్యే యువకుడి పాత్రలో హీరో శివ కార్తికేయన్ అదరగొట్టాడు. అలాగే విలన్‌గా విద్యుత్ జమాల్ (Vidyut Jamal) మెప్పించాడు. బిజు మేనన్, విక్రాంత్, షబ్బీర్ కారెక్కల్, అడుకళం నరేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతమందించారు.
ఈ సినిమా అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని హీరో శివ కార్తికేయన్‌తో వీడియో ద్వారా అనౌన్స్ చేశాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మదరాసి సినిమా స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: