हिन्दी | Epaper

Sivaji: థియేటర్లలోనే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’

Anusha
Sivaji: థియేటర్లలోనే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’

నటుడు శివాజీ (Sivaji) మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వరుస చిత్రాలతో తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటున్న ఆయన, ఈసారి స్వీయ నిర్మాణంలో రూపొందిన చిత్రంతో వార్తల్లో నిలిచారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన తాజా చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ విడుదల విషయంలో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. మొదట ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ వేదికపై విడుదల చేయాలని భావించిన చిత్రబృందం, చివరి నిమిషంలో కీలక నిర్ణయం తీసుకుని థియేట్రికల్ రిలీజ్ వైపు మళ్లింది.

Read Also: Ram charan twins : రామ్‌చరణ్ కవలల పేర్లు రివీల్, శివరామ్, అన్విరా దేవి!

థియేటర్లలోనే రిలీజ్

చిత్రంలో శివాజీ (Sivaji) కి జోడీగా సీనియర్ నటి లయ నటించారు.అందుకు అనుగుణంగా ప్రమోషన్లు కూడా నిర్వహించారు. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాని ‘ఈటీవీ విన్’ వేదికగా డైరెక్టర్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలిపింది. దానికి అనుగుణంగానే ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. ముందు ప్రకటించిన ప్రకారమైతే ఈరోజు నుంచి ఓటీటీలోకి రావాలి.

కానీ, ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాని ఓటీటీలో కాకుండా, థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మార్చి 6న వస్తుందని విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. ప్రేక్షకుల డిమాండ్‌ మేరకే వెండితెరపైకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 6న అందరం థియేటర్స్‌లో కలుద్దామని శివాజీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మూవీ ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాకే రిలీజ్ విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారని టాక్ వినిపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870