సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుమార్తె, చిన్నారుల స్టార్‌గా ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni) తాజాగా ఒక కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా యుగంలో నకిలీ ఖాతాలు, స్పామ్ అకౌంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివల్ల సెలెబ్రిటీల పేరుతో అనేక తప్పుడు సమాచారాలు, వదంతులు పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో సితార కూడా ఒకరు. తన పేరుతో నకిలీ అకౌంట్లు నడుస్తున్నాయన్న విషయం తెలిసిన వెంటనే ఆమె స్పందించి తన అభిమానులకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు.సితార తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Official Instagram) ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. “నా పేరు మీద అనేక నకిలీ, స్పామ్ ఖాతాలు సృష్టిస్తున్నారని నాకు తెలిసింది.
స్పామ్ అకౌంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి
నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ నేను చెప్పేది ఒక్కటే – నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటాను. ఇదే నా అధికారిక ఖాతా. వేరే ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ నేను లేను. దయచేసి నా పేరుతో ఉన్న ఇతర ఖాతాలతో జాగ్రత్తగా ఉండండి” అని ఆమె స్పష్టం చేశారు.సితార తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎంతో చురుగ్గా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన విషయాలు, వ్యక్తిగత అప్‌డేట్స్, వివిధ బ్రాండ్స్‌తో తన కొలాబరేషన్స్‌కు సంబంధించిన వివరాలను తరచూ పంచుకుంటూ ఉంటారు. తండ్రి మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని ‘పెన్నీ’ పాట ద్వారా ఆమె వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Read also: