సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు రాధిక ఆప్టే. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. (Sister Midnight) ఇటీవల ఆమె నటించిన లేటేస్ట్ మూవీ సిస్టర్ మిడ్ నైట్. బోల్డ్ కాన్సెప్ట్ తో డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి కరణ్ కాందహారి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాధికతోపాటు అశోక్ పాఠక్, ఛాయా కదమ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 25 నుంచి ‘జియో హాట్ స్టార్’ (‘Jio Hot Star‘) లో అందుబాటులోకి వచ్చింది.
Read Also: Ranveer Singh: 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ‘ధురంధర్’

కథ
విషయానికి వస్తే.. గోపాల్ (అశోక్ పాఠక్), ఉమ (రాధిక ఆప్టే) పక్క పక్క గ్రామాల్లోనే ఉంటారు. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. (Sister Midnight) దీంతో తన పెళ్లి ఉమకు అస్సలు నచ్చదు. భార్యతోపాటు ముంబైలో ఓ మురికి వాడలో చిన్న ఇంట్లో నివసిస్తుంటాడు గోపాల్. కానీ ఉమకు అక్కడ ఉండడం, వంట పనులు చేయడం నచ్చదు. కానీ లగ్జరీగా ఉండాలనే కోరికలు ఎక్కువే. దీంతో మానసిక ఒత్తిడి పెరగడంతో వింతగా ప్రవర్తిస్తుంటుంది. జంతువులను చంపేస్తుంటుంది. ఒకరోజు తెల్లారి లేచేసరికి భర్త శవమై కనిపిస్తాడు. భర్త శవాన్ని ఇంట్లోనే పెట్టి ఉమ ఏం చేసింది.? ఆ తర్వాత ఏం జరిగింది ? అనేది సినిమా.
విశ్లేషణ
ముంబై మహానగరంలో ఒక మురికివాడ .. ఒక చిన్న గది .. భార్యాభర్తలు .. వీటి చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఇష్టం లేని పెళ్లి .. అసంతృప్తితో కూడిన నివాసం .. ప్రేమ – ప్రశాంతత లోపించిన జీవితం .. ఇవన్నీ కూడా మానసిక స్థితి పట్ల ప్రభావం చూపించేవే. అలాంటి పరిస్థితులలో ఉమ ఎలా మారిపోయిందనే దిశగా ఈ కథ నడుస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: