
తమిళ సీనియర్ దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరో శిలంబరసన్ (Silambarasan) (శింబు) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అరసన్’ (Arasan) ఇప్పటికే సినిమావర్గాల్లో భారీ ఆశలతో ఆకర్షిస్తోంది. ఈ చిత్రం తెలుగులో ‘సామ్రాజ్యం’ పేరుతో రిలీజ్ కాబోతోందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Read Also: Telusu Kada Review : ‘తెలుసుకదా’ రివ్యూ రొమాంటిక్ డ్రామాగా నిలిచింది
తాజాగా చిత్రయూనిట్ విడుదల చేసిన ఇంట్రో ప్రోమో ప్రేక్షకులను చిత్ర కథ, సాహసభరిత సన్నివేశాల వైపు ఆకర్షిస్తోంది.ఈ ప్రోమో చూస్తుంటే శింబు (Silambarasan) పాత్రను పరిచయం చేసినట్లు కనిపిస్తుంది. ఒక కేసులో భాగంగా అరెస్ట్ అయిన శింబు తాను ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనేది మీడియా ముందు చెప్పే క్రమంలో ఈ సన్నివేశం సాగుతుంది.
తనకి ఎలాంటి సంబంధం లేదంటూ
ముగ్గురిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శింబును జడ్జి నువ్వు ఈ హత్య చేశావా అంటూ అడుగగా.. తనకి ఎలాంటి సంబంధం లేదంటూ శింబు (Simbu) చెబుతాడు.అనంతరం శింబు అసలు పాత్ర రివీల్ అవుతుంది. ఇక ఈ వీడియోను తెలుగులో అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశాడు.
V Creations బ్యానర్‌పై ఈ సినిమాను కలైపులి ఎస్. థాను నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాను సురేష్ ప్రోడక్షన్స్ (Suresh Productions) విడుదల చేయబోతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: