శ్రద్ధా (Shraddha Kapoor) నటిస్తున్న ‘ఈతా’ బయోపిక్ షూటింగ్ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో ఆమె ఎడమ కాలికి ఫ్రాక్చర్ కావడంతో యూనిట్ సభ్యులు సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నాసిక్‌లో జరుగుతోంది.
Read Also: IBOMMA RAVI: ఐబొమ్మ రవి కేసులో కీలక మలుపు
మిడ్-డే కథనం ప్రకారం, ఒక లావణి పాటను చిత్రీకరిస్తున్న సమయంలో శ్రద్ధా గాయపడింది. వేగవంతమైన డ్యాన్స్ స్టెప్పులు వేస్తుండగా, ఆమె తన శరీర బరువు మొత్తం ఎడమ కాలిపై వేయడంతో బ్యాలెన్స్ కోల్పోయి కిందపడింది. ఈ పాత్ర కోసం శ్రద్ధా 15 కిలోలకు పైగా బరువు పెరిగిందని, నౌవారీ చీర,

రెండు వారాలకు చిత్రీకరణ ప్రారంభం
బరువైన ఆభరణాలు ధరించి డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని సమాచారం.ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత, రెండు వారాలకు చిత్రీకరణ తిరిగి ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ విషయంపై శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) సోషల్ మీడియాలో ఇంకా స్పందించలేదు.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా కళాకారిణి, ‘తమాషా సామ్రాజ్ఞి’గా పేరుగాంచిన విఠాబాయి నారాయణగావ్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆమె జానపద నృత్యానికి చేసిన సేవలకు గాను 1957, 1990లలో రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: