క్లాసిక్ లవ్ స్టోరీలకు మరో పేరు మణిరత్నం (Mani Ratnam). ప్రతి సినిమాలోనూ ప్రేమను ఒక కొత్త కోణంలో చూపిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఈ మాస్టర్ డైరెక్టర్, మళ్లీ అదే జోనర్‌లోకి అడుగుపెడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఆయన త్వరలో ఓ క్లాసిక్ రొమాంటిక్ డ్రామాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా, రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటించనున్నారని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
Read Also: Bigg boss: భరణి రీ-ఎంట్రీతో హౌస్‌లో కొత్త హంగామా!

క్లాసిక్ లవ్ స్టోరీల మాస్టర్ మణిరత్నం
ప్రస్తుతం వారితో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని టాక్. మణిరత్నం తీసిన బాంబే, రోజా, దిల్ సే, సఖి, గీతాంజలి తదితర చిత్రాలు క్లాసిక్‌లుగా నిలిచిన విషయం తెలిసిందే.విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రస్తుతం దక్షిణాదిలోనే కాదు, బాలీవుడ్‌లో కూడా బిజీగా ఉన్నాడు.
‘జవాన్’, ‘మేరీ క్రిస్మస్’ వంటి చిత్రాలతో తన నటనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అటువంటి నటుడు మణిరత్నం దర్శకత్వంలో నటించడం అంటే ప్రేక్షకులకు double excitement. ఈ కాంబినేషన్‌లో ఎంత లోతైన భావోద్వేగం, intense performance ఉంటుందో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: