ప్రముఖ నటి సంగీత (Sangeetha) మరియు ఆమె భర్త, గాయకుడు క్రిష్ (Krish) విడాకులు తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్‌కు స్వయంగా సంగీతనే పుల్‌స్టాప్ పెట్టారు.

“విడాకుల వార్తలు అసత్యం” – స్పష్టమైన స్పందన
ఈ కథనాలపై తాజాగా స్పందించిన సంగీత (Sangeetha), తాము విడాకులు తీసుకుంటున్నామన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అసంబద్ధమని, తాము సంతోషంగా కలిసి ఉంటున్నామని చెప్పారు.
భర్తతో కలిసి ఫోటో షేర్ చేస్తూ కౌంటర్
ఆమె ఈ వ్యాఖ్యలతో పాటు, భర్త క్రిష్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది విడాకుల రూమర్స్ (Divorce rumors)పై ఆమె ఇచ్చిన ఓ స్పష్టమైన కౌంటర్‌గా మారింది. అభిమానులు ఈ ఫోటోను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్స్టా బయో మార్పే వార్తలకు కారణం?
ఈ వివాదానికి కారణమైనది ఆమె ఇన్‌స్టాగ్రామ్ సంగీత పేరు సంగీత క్రిష్ గా ఉండేది. అయితే, ఆమె ఆ పేరును మార్చడంతో ఇద్దరూ విడిపోతున్నారనే ప్రచారం మొదలయింది. దీంతో, ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తామిద్దరం బాగానే ఉన్నామని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: