हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

సమంత కొత్త లుక్ వైరల్..

Sharanya
సమంత కొత్త లుక్ వైరల్..

టాలీవుడ్ అందాల తార సమంత సినిమాలకు దూరంగా ఉన్నా కూడా వార్తల్లో మాత్రం ఎప్పుడూ టాప్‌లోనే ఉంటోంది. ఆమె జీవితం, సినిమాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత విషయాలు అన్నీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఇటీవల సమంత తన తాజా ఫోటోషూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆమె పెళ్లి కూతురు గెటప్‌లో కనిపించడం వైరల్‌గా మారింది. ఈ ఫోటోల వల్ల మరోసారి సమంత పెళ్లి వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె నిజంగానే రెండో వివాహానికి సిద్ధమవుతోందా? కేవలం ఫోటోషూట్ మాత్రమేనా?

384348 samantha

కెరీర్‌లో కొత్త మలుపు

సమంత తన సినీ ప్రయాణాన్ని 2010లో ఏ మాయ చేసావే సినిమాతో మొదలు పెట్టి, ఒకదాని తర్వాత ఒకటి విజయవంతమైన సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె కెరీర్‌లో కొన్ని కీలక మార్పులు వచ్చాయి. సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా కోలుకుంటూ, మళ్లీ సినిమాలను లైనప్‌ చేస్తున్నది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉండి, ప్రధానంగా కథానాయకిగా ఉండే సినిమాలనే ఎంచుకుంటోంద విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ఖుషి సినిమా తర్వాత సమంత మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. కానీ ఇప్పుడు మా ఇంటి బంగారం అనే సినిమాతో ఆమె నిర్మాతగా మారి, తెలుగులో తిరిగి రీఎంట్రీ ఇస్తోంది.

    పెళ్లి కూతురు గెటప్ వెనుక అసలు నిజమేంటి?

    సమంత ఇటీవల ఓ ఫోటోషూట్‌లో పెళ్లి కూతురు గెటప్‌లో దర్శనమిచ్చింది. వైట్ లెహంగా, ముక్కుపుడక, ఎర్రటి బొట్టు వేసుకుని నార్త్ ఇండియన్ బ్రైడ్ లుక్‌లో కనిపించింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. ఇది కేవలం ఓ ఫోటోషూట్ మాత్రమేనా? లేక కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగమా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ సమంత తెలుగులో తిరిగి అడుగుపెట్టే మా ఇంటి బంగారం సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోవడంతో, ఈ ఫోటోషూట్ ఆ సినిమాకు సంబంధించినదేనని కొందరు అనుకుంటున్నారు. రెండో పెళ్లి వార్తల్లో నిజముందా – బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో సమంతకి సంబంధం ఉందని, వీరిద్దరూ త్వరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై సమంత ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒక కొత్త వెబ్ సిరీస్‌లో భాగమా- గతంలో సమంత సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో నటించగా, అది అంతగా ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేదు. ఇప్పుడు సమంత మరో కొత్త వెబ్‌సిరీస్ కోసం పెళ్లి కూతురి లుక్ ట్రై చేసిందని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తన వ్యక్తిగత జీవితాన్ని బహిరంగంగా పంచుకుంటూ, సొంత నిర్ణయాలు తీసుకుంటోంది. న్యూయార్క్, లండన్ లాంటి నగరాల్లో ఎక్కువ సమయం గడుపుతూ, తనకు నచ్చిన హాలిడే ట్రిప్స్ చేస్తోంది. విడాకుల తర్వాత కొంతకాలం బాధపడినా, ఆ తరువాత తన కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టింది. ఓవైపు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే, మరోవైపు కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. సమంత సినిమాలకు దూరంగా ఉన్నా కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పెళ్లి వార్తలపై క్లారిటీ ఇవ్వకపోవడంతో, గాసిప్స్ మరింత ఊపందుకున్నాయి. కానీ నిజంగానే సమంత పెళ్లికి సిద్ధమవుతోందా? లేక కేవలం ప్రచారమేనా? అన్నది సమయం చల్లనిచ్చేంతవరకు చెప్పలేం.

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    📢 For Advertisement Booking: 98481 12870