టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన కెరీర్ గురించి మాట్లాడిన ప్రతిసారి ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తారు. ఆమె ఇప్పుడు 15 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. ఈ కాలంలో ఎన్నో విజయాలు, కొన్ని కష్టాలు, వృత్తి పరమైన సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ సమంత ఎప్పుడూ తన ప్రత్యేకతను నిలుపుకుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, తన కెరీర్‌లో కొత్త అధ్యాయం మొదలైందని, ఆ ప్రయాణం ద్వారా ఇతరులకు స్ఫూర్తినివ్వాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సమంత మాటల్లో ముఖ్యంగా ఒక విషయం స్పష్టమవుతుంది: స్టార్‌డమ్ (Stardom) అనేది శాశ్వతం కాదని ఆమె నమ్మకం. నటీనటుల జీవితంలో పేరుప్రఖ్యాతలు, కీర్తిప్రతిష్టలు కొంతకాలం మాత్రమే ఉంటాయి. ఒక దశలో ప్రేక్షకులు కొత్త ముఖాలను స్వాగతిస్తారు, కొత్త తరహా కథలకు ఆసక్తి చూపుతారు. అలాంటి సమయంలో ఒక నటుడు లేదా నటి తన కెరీర్‌ను ఎంత సృజనాత్మకంగా మలుచుకుంటాడో, తన ప్రభావాన్ని సమాజంపై ఎలా చూపిస్తాడో అనేదే అసలైన విజయంగా సమంత భావిస్తున్నారు.
విజయాలు అనేకమందికి ఆదర్శంగా నిలుస్తాయని
సినీ పరిశ్రమలో (film industry) మహిళా నటీమణుల ప్రయాణం ఎక్కువకాలం కొనసాగదని, అవకాశాలు కూడా తక్కువే వస్తాయని సమంత అనుభవంతో చెప్పడం ఒక పెద్ద వాస్తవం. అయినప్పటికీ, తాను సాధించిన విజయాలు అనేకమందికి ఆదర్శంగా నిలుస్తాయని ఆమె అంటున్నారు. స్టార్‌గా ఉన్నప్పుడు కొందరికి ప్రేరణగా నిలబడగలగడం, ఒకరికి అయినా మార్గదర్శకురాలిగా ఉండగలగడం నిజమైన సంతృప్తినిస్తుందని ఆమె భావన.మహిళలు ధైర్యంగా ముందడుగు వేయాలని పిలుపునిస్తూ, “ఏ విషయంలోనైనా భయపడకుండా రిస్క్ తీసుకునే మహిళలే (Women) విజయం సాధిస్తారనే విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను.

మనల్ని మనం నమ్మినప్పుడే పురోగతి ఉంటుంది. దూరదృష్టి ఉన్న ప్రతి మహిళా బయటకు వచ్చి తన ఆలోచనలను పంచుకోవాలి. ఎందుకంటే ప్రపంచం ఇప్పుడు వారి నాయకత్వాన్నే కోరుకుంటోంది,” అని సమంత వివరించారు.ప్రస్తుతం సమంత నటిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థలో ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించి విజయాన్ని అందుకున్నారు. మరోవైపు, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్య నిపుణులతో కలిసి హెల్త్ పాడ్‌కాస్ట్‌లు చేస్తూ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: