
‘విరూపాక్ష’ (‘Virupaksha’ Movie) వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరో సారిగా ప్రేక్షకుల ముందుకు శక్తివంతమైన పాత్రతో రానున్నారు.మేనమామ పవన్ కళ్యాణ్‌తో కలిసి తీసిన ‘బ్రో’ సినిమా పూర్తిగా నిరాశపరచగా.. సంపత్ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్’ అనే సినిమా కొద్దిరోజులకే అది ఆగిపోయింది.
Read Also: Kareena Kapoor: నా కొడుకు ఎప్పుడూ కోహ్లీ గురించే అడుగుతాడు: కరీనా కపూర్
టైటిల్‌లో ‘గాంజా’ అనే పేరు వాడటంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత ‘హనుమాన్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణంలో కేపీ రోహిత్ దర్శకత్వంలో ‘ సంబరాల ఏటిగట్టు ’ సినిమాని ప్రకటించారు.
ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతిబాబు, సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్నారు.సాయి తేజ్ (Sai Dharam Tej) జన్మదినం సందర్భంగా ఈ రోజు మూవీ టీమ్ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసారు.సాయి తేజ్ ఇందులో బాలీ అనే పాత్రలో కనిపించబోతున్నాడు.
అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు
ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా గ్లింప్స్‌తో అవి మరింత పెరిగాయి.
మాస్ లుక్‌లో సాయి తేజ్, ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సన్నివేశాల హైపర్ ఎనర్జీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణని ఇస్తున్నాయి. గ్లింప్స్ వీడియో ద్వారా సాయి తేజ్ మరో కెరీర్ హిట్ కొట్టబోతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: