భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఒకసారి మాట్లాడితే అందరి దృష్టి అక్కడే ఉంటుంది. అసలు సినిమా విషయాల్లో అరుదుగా స్పందించే ఆయన్ను ఒక ప్రాంతీయ సినిమా ఆకట్టుకోవడం విశేషమే కదా? తాజాగా తమిళ చిత్రం ‘3BHK’పై సచిన్ ప్రశంసల వర్షం కురిపించడంతో ఆ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అభిమానులతో మాట్లాడే సందర్భంలో, ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు.సచిన్ టెండూల్కర్ ఇటీవల రెడ్డిట్ AMA (Ask Me Anything) సెషన్‌లో అభిమానులతో ఓపికగా సంభాషించారు. అభిమానులు ఆయనకు ఇటీవల మీకు నచ్చిన సినిమాలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అప్పుడు సచిన్ మాట్లాడుతూ:తనకు లభించిన చిన్న సమయాల్లో మంచి సినిమాలు చూస్తానని, ఇటీవల తమిళంలో ‘3BHK’ మరియు మరాఠీలో ‘అటా థంబ్యాచా నాయ్’ చూశానని చెప్పారు.ఈ రెండు సినిమాలు తన మనసుని తాకాయని, కథనశైలి బాగా నచ్చిందని పేర్కొన్నారు. ఇది ఓ ప్రాంతీయ చిత్రానికి, అంతర్జాతీయ క్రీడాకారుడి నుండి లభించిన గొప్ప గుర్తింపుగా మారింది.

దర్శకుడు శ్రీ గణేశ్ స్పందన – ఉద్వేగం కలిగించిన పోస్ట్
సచిన్ ప్రశంసలు దర్శకుడు ‘శ్రీ గణేశ్’కి నిజంగా ఊపిరి పోయేంత ఆనందాన్ని కలిగించాయి. ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ:సచిన్ సర్, మీరు మా చిన్ననాటి ఆదర్శం. మీ నోటి నుంచి మా సినిమా గురించి మాటలు వినడం జీవితాంతం గుర్తుండిపోతుంది,అంటూ గుండెతట్టేలా రాసారు. ఈ పోస్టుతో ‘3BHK’ సినిమా (‘3BHK’ movie) కే కాదు, మొత్తం చిత్ర బృందానికే ఆత్మవిశ్వాసం పెరిగింది.ఈ చిత్రం ‘3BHK’ ఓ సాదాసీదా కాన్సెప్ట్‌తో మొదలై, ప్రేక్షకుడి మనసు దోచింది. ఇందులో సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని, మీతా రఘునాథ్ లాంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.సినిమాలో మధ్యతరగతి కుటుంబం సొంత ఇల్లు కొనాలన్న కలతో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో చూపించారు. కథ సింపుల్‌గా ఉండగా, స్క్రీన్‌ప్లే మాత్రం హార్ట్‌టచింగ్.
థియేటర్లలోనూ, ఓటీటీలోనూ విజయం
‘3BHK’ సినిమా మొదట థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందింది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక మరింత మందికి చేరింది. కథలోని ఎమోషన్, పాత్రల సహజత్వం, సందేశం – ఇవన్నీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి.ఇప్పుడు సచిన్ మెచ్చుకోవడం ఈ సినిమాకి చక్కటి గుర్తింపు. నిజంగా ఒక మంచి సినిమా ఎప్పటికీ తళుక్కుమంటుందనడానికి ఇది మంచి ఉదాహరణ.సచిన్ ఒక సినిమా పేరు చెప్పడం కంటే… ఆ సినిమాను గుండెతో చూసానని చెప్పడం గొప్ప విషయం. ‘3BHK’లాంటి చిన్న సినిమాకు ఇది బలమైన గుర్తింపు. ప్రేక్షకులకు నచ్చిన సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి – ఇప్పుడది మరోసారి నిరూపితమైంది.
Read Also :