నెమ్మదిగా కానీ నిశ్చయంగా కెరీర్ ముందుకు
కొంతమంది హీరోయిన్స్ కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోలతో నటించే అదృష్టం పొందుతారు. మరికొందరికి ఆ అవకాశాలు కాస్త ఆలస్యంగా వస్తాయి. అయితే కొందరు నాయికలు తొందరపడకుండా తమ ప్రతిభతో, ఎంపికలతో కెరీర్‌ను స్థిరంగా ముందుకు తీసుకెళ్తారు. రుక్మిణి వసంత్(Rukmini Vasant)కూడా అలాంటి వారిలో ఒకరు. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాలో ఆమె సాధారణమైన కానీ పద్ధతిగా కనిపించిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. చీరకట్టులో ఆమె అందం విశేషంగా చర్చకు దారితీసింది.
Read also: పిల్లలతో కేరింతలు.. ముంచుకొచ్చిన వరద నీటితో ఆరుగురి మృతి

‘కాంతార చాప్టర్ 1’తో గ్లామరస్ టచ్, కొత్త ఆఫర్లు
చీరకట్టులోనే బాగుంటుందనే అభిప్రాయం నుంచి బయటపడటానికి రుక్మిణి గ్లామరస్ ఇమేజ్‌కి మారాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమాలో యువరాణి పాత్రలో ఆమె అద్భుతంగా మెరిసింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో, రుక్మిణి వసంత్‌కి(Rukmini Vasant) తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ ఆఫర్లు రావడం మొదలైంది. తెలుగు ప్రేక్షకులు ఆమెను వెంకటేశ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన చూడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్‌తో కలిసి ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తోంది
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: