తమిళ సినీ పరిశ్రమలో ధనుష్ (Dhanush) ప్రత్యేక శైలితో చిరస్థాయిగా గుర్తింపు పొందుతున్నాడు. హిట్లు, ఫ్లాప్స్ వంటి వాణిజ్య ఫలితాల పట్ల అసహనం లేకుండా, వరుసగా సినిమాలు చేస్తూ నటనలో తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న ధనుష్, అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అతను విభిన్నమైన పాత్రలను స్వీకరించి ప్రతి పాత్రలో కొత్తవిధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. కేవలం తెలుగు, తమిళ్, హిందీ భాషలలో మాత్రమే కాక, హాలీవుడ్‌లో కూడా నటించి తన ప్రతిభను చాటాడు.
హీరోగానే కాదు ధనుష్ ఎన్నో సందర్భాల్లో తన గొప్పమనసును కూడా చాటుకున్నాడు. తాజాగా ధనుష్ తనతో నటించిన నటుడు రోబో శంకర్ (Robo Shankar) మృతికి సంతాపం తెలిపారు. అనారోగ్యంతో రోబో శంకర్ నిన్న (సెప్టెంబర్ 18న ) కన్నుమూశారు.ధనుష్ నటించిన మారి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అజిత్ నటించిన విశ్వాసం, శివకార్తికేయన్ తో వేలైక్కారన్ వంటి చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించారు.
రోబో శంకర్ మృతి పై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం
గత కొన్ని నెలలుగా ఆయన కామెర్లుతో బాధపడుతున్నారు.ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స తీసుకుంటూనే సెప్టెంబర్ 18న మరణించారు. ఆయనకు 46 ఏళ్లు.రోబో శంకర్ మృతి పై సినీ ప్రముఖులు (Movie celebrities) సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ శంకర్ మృతికి సంతాపం తెలిపారు. తాజాగా ధనుష్ రోబో శంకర్ భౌతికాయానికి నివాళులు అర్పించారు. రోబో శంకర్ కూతురు లేడీ కమెడియన్ ఇంద్రజా శంకర్‌ను ధనుష్ ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మారి, మారి 2 సినిమాలో ధనుష్ తో పాటు రోబో శంకర్ నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్స్‌లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: