గత కొన్ని సంవత్సరాలుగా రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తీసిన సినిమాలు చూస్తుంటే, వాటిలో ఒక్కటి కూడా ప్రత్యేకంగా standout అవ్వలేదు.చాలా సినిమాలు సరిగ్గా ఏదో అర్థం లేకుండా, గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా ఫీల్.కానీ, ఆర్జీవీ పాత సినిమాలు మాత్రం వేరు. ఆయన రూపొందించిన కొన్ని షాట్స్ ఇంకా మనల్ని ఉడికిస్తాయి.అందులో ఒకటి “రక్తచరిత్ర” సినిమాకు సంబంధించిన సీన్.ఈ మధ్య కాలంలో టాలీవుడ్ అనేది కమర్షియల్, పెద్ద బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల పేర్లతో వర్థిల్లిపోయింది. తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు గగనానికి చేరుకుంది.ప్రస్తుతం దర్శకులు, నిర్మాతలు, నటీనటులు సినిమాల కోసం తమ ప్రాణాలు పోస్తున్నారు. రాజమౌళి, నాగ్ అశ్విన్ లాంటి దర్శకుల పేర్లు మరింత గొప్పగా వినిపిస్తున్నాయి.
కానీ, తెలుగుసినిమాకు దిశ, దశ మార్చిన ఒక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. “శివ” సినిమాతో ఆయన తెలుగు సినిమాను పూర్తిగా మార్చేశాడు.కొత్త పంథాలు తెచ్చాడు.అయితే, ఆర్జీవీ తీసిన ఓ ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.”రక్తచరిత్ర” సినిమాలో వివేక్ ఒబేరాయ్ యొక్క పాత్ర ప్రాతాప్ రవిని పాత చేతక్ స్కూటర్ పై రివీల్ చేసిన సీన్ చక్కగా తెరకెక్కింది.ఆ సీన్‌లో slow-motionలో వివేక్ ఎంట్రీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అన్నీ అంతా కలవడంతో, ప్రేక్షకులు థియేటర్లో మోతెక్కారు.ఆ సీన్ ఇంకా చూసినా,అదిరిపోయే హై వస్తుంది.
సాధారణ స్కూటీపై హీరోని ఇలా ఎలివేట్ చేయడం ఆర్జీవీకే సాధ్యం.”రక్తచరిత్ర” సినిమాకి ఆధారం అయినది పరిటాల రవి జీవితం.2010లో విడుదలైన “రక్తచరిత్ర” మరియు “రక్తచరిత్ర-2” తర్వాత, 2017లో వివేక్ ఒబేరాయ్ “వినయ విధేయ రామ” సినిమాతో తెలుగులో కనిపించారు.కానీ, అప్పటినుంచి వివేక్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయలేదు.ఆర్జీవీ తీసిన సినిమాలు తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన మలుపు.అవి ప్రస్తుతం కూడా అభిమానుల మధలో గుర్తించబడతాయి, కానీ ప్రస్తుతం ఆయన చేసే సినిమాలు అప్పటివంటి Magic ఇవ్వడం లేదు.