हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Untamed: అన్ టేమ్డ్ (నెట్ ఫ్లిక్స్)లో సిరీస్ రివ్యూ!

Ramya
Untamed: అన్ టేమ్డ్ (నెట్ ఫ్లిక్స్)లో సిరీస్ రివ్యూ!

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన కొత్త అమెరికన్ డ్రామా మర్డర్ మిస్టరీ సిరీస్ ‘అన్ టేమ్డ్’ (Untamed) గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. ఎరిక్ బానా, లిల్లీ శాంటియాగో, సామ్ నీల్ వంటి ప్రముఖ తారాగణంతో రూపొందించబడిన ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్‌లతో ఉంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 నుండి 50 నిమిషాలు. థామస్ బెజుచా, నీసా హార్డిమాన్, నిక్ మర్ఫీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 17వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్ అవుతోంది.

Untamed: అన్ టేమ్డ్ (నెట్ ఫ్లిక్స్)లో సిరీస్ రివ్యూ!
Untamed: అన్ టేమ్డ్ (నెట్ ఫ్లిక్స్)లో సిరీస్ రివ్యూ!

కథా నేపథ్యం

Untamed: కథ యేసెమిటి నేషనల్ పార్క్‌లో మొదలవుతుంది. ఇది ఒక దీవిని తలపించే విశాలమైన ప్రాంతం. ఎత్తైన పర్వతాలకు పెట్టింది పేరు కావడంతో ఇక్కడ ట్రెక్కింగ్ విరివిగా జరుగుతూ ఉంటుంది. ఒక రోజు ఇద్దరు వ్యక్తులు ట్రెక్కింగ్ కోసం ‘ఎల్ క్యాపిటన్’ (El Capitan) అనే పర్వతం దగ్గరికి చేరుకుంటారు. వారు ఆ పర్వతాన్ని ఎక్కుతూ ఉండగా, అకస్మాత్తుగా ఆ కొండపై నుంచి ఒక యువతి వారిపై పడిపోతుంది. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మరణిస్తుంది.

ఈ విషయం తెలియగానే ఇన్వెస్టిగేటివ్ సర్వీసెస్ బ్యాచ్‌కు చెందిన టర్నర్ (ఎరిక్ బానా) అక్కడికి చేరుకుంటాడు. అప్పటికే రెస్క్యూ బృందం అక్కడ ఉంటుంది. చనిపోయిన యువతి పేరు ‘జేన్ డో’ అని తెలుసుకుంటారు. ఆమె అసలు ఎవరు? ఆ పర్వతంపై నుంచి ఆమె దూకేసిందా? లేదంటే ఎవరైనా తోసేశారా? అనే ప్రశ్నలు వారిని అయోమయానికి గురిచేస్తాయి. పర్వతం పై నుంచి పడిపోవడానికి ముందే ఆమె కాలికి గాయమైందని టర్నర్ గ్రహిస్తాడు. సింహం గానీ, తోడేళ్లు గానీ దాడి చేసి ఉండవచ్చని భావిస్తారు. ఈ మిస్టరీని ఛేదించాల్సిన బాధ్యత టర్నర్‌పై పడుతుంది.

టర్నర్ గతంలో తన పసివాడైన కొడుకును కోల్పోతాడు. అప్పటి నుంచి మానసికంగా అతను తీవ్రంగా కుంగిపోతాడు. భార్య కూడా దూరం కావడంతో అతని బాధ మరింత పెరుగుతుంది. ఈ వ్యక్తిగత విషాదాల మధ్యనే అతను రెస్క్యూ టీమ్‌కు చెందిన **నయా (లిల్లీ శాంటియాగో)**ను అసిస్టెంట్‌గా తీసుకుని, ‘జేన్ డో’ మరణం వెనుక గల రహస్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగుతాడు. జేన్ డో ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె గురించిన అన్వేషణలో అతనికి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? ఆ నిజాలు తెలుసుకున్న టర్నర్ ఏం చేస్తాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ

‘అన్ టేమ్డ్’ (Untamed) సిరీస్ చాలా ఆసక్తికరమైన సన్నివేశంతో ప్రారంభమవుతుంది. మొదటి సన్నివేశంతోనే ప్రేక్షకులను కథలోకి, ప్రధాన అంశానికి సంబంధించిన పర్వతం దగ్గరికి తీసుకువెళ్లి నిలబెడతారు. కథకు కనెక్ట్ కావడంలో ఈ లొకేషన్ కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. కథ ఇక్కడి నుంచే మొదలై, అవసరమైనప్పుడల్లా మనలను మళ్లీ మళ్లీ ఇక్కడికి తీసుకువస్తుంటుంది.

సిరీస్‌లోని హీరో టర్నర్‌కు తన కొడుకును కోల్పోయిన బాధ ఉంటుంది. అలాగే, డిపార్ట్‌మెంట్ నుంచి ఒత్తిడి కూడా ఎదురవుతుంది. ఇక వృత్తి రీత్యా తనకి సహకరిస్తున్న నయా జీవితం కూడా ఆమె భాగస్వామి కారణంగా ప్రమాదంలో పడుతుంది. ఆమెను, ఆమె కొడుకును కాపాడవలసిన బాధ్యత కూడా టర్నర్‌పై ఉంటుంది. ఈ పరిస్థితులను ఎదుర్కొంటూ అతను ఎలా ముందుకు వెళ్లాడనేది దర్శకుడు చిత్రీకరించిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది.

కథ చాలా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, కథనం మాత్రం కాస్త నిదానంగా సాగుతుంది. సాధారణంగా పోలీస్ కథల్లో కనిపించే వేగం ఈ సిరీస్‌లో కనిపించదు. అలాగని బోర్ కొట్టదు. కథ, కథనం ఒక ఎత్తయితే, లొకేషన్స్ ఒక ఎత్తు అని చెప్పాలి. కళ్లు విశాలంగా చేసుకుని, ఆనందాశ్చర్యాలకు లోనవుతూ చూసే లొకేషన్స్ ఇవి. అద్భుతమైన ఈ విజువల్స్ ఈ కథకు మరింత బలాన్ని చేకూర్చాయనడంలో అతిశయోక్తి లేదు.

నటీనటుల పనితీరు

ప్రధానమైన పాత్రలను పోషించిన నటీనటులు తమ పాత్రలలో జీవించారనే చెప్పాలి. ఒకవైపు మర్డర్ మిస్టరీకి సంబంధించిన కథను నడిపిస్తూనే, మరోవైపు కుటుంబ భావోద్వేగాలను ఆవిష్కరించడంలో దర్శకుడు తన నైపుణ్యాన్ని చక్కగా ప్రదర్శించాడు. కెమెరా పనితనం గొప్పగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కథకు మరింత మద్దతుగా నిలిచింది. ఎడిటింగ్ కూడా బాగుంది.

ముగింపు

‘అన్ టేమ్డ్’ సిరీస్ యాక్షన్, అడ్వెంచర్, సున్నితమైన భావోద్వేగాలతో కూడినది. కథాకథనాలు నిదానంగా కదులుతున్నట్టుగా అనిపించినా, కథపై కుతూహలం చివరివరకు కొనసాగుతూనే ఉంటుంది. అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను చివరివరకూ ఈ సిరీస్ ముందు కూర్చోబెడతాయి. మొత్తంగా, ఇది ఒక విభిన్నమైన మర్డర్ మిస్టరీ డ్రామా.

“అన్‌టేమ్డ్” నిజమైన కథ ఆధారమా?

ఈ నవలతో పాటు టీవీ డ్రామా కూడా చైనీస్ పురాణాలు, మానవ చరిత్ర, మరియు యుద్ధకళలతో స్ఫూర్తి పొందిన ఒక కల్పిత ప్రపంచంలో జరుగుతుంది. కథలో చైనా సంస్కృతి, చరిత్రను తలపించే అంశాలు కనిపించినా, ఇది పూర్తిగా కల్పిత ప్రపంచానికి చెందినదే. ఇందులో అనేక మాయాజాల, అద్భుత శక్తుల వంటి సూపర్‌నాచురల్ అంశాలు ఉన్నాయి..

Read hindi news: hindi.vaartha.com

Read also: Velu Prabhakaran: తమిళ దర్శకుడు వేలు ప్రభాకరన్ ఇకలేరు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870