హిందీ వెబ్ సిరీస్ “ది రాయల్స్” (The Royals) 2025లో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రియాంక ఘోష్ మరియు నుపుర్ ఆస్థాన దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఇషాన్ ఖట్టర్, భూమి ఫెడ్నేకర్, విహాన్ సమత్, కావ్య టెహ్రాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 8 ఎపిసోడ్లుగా రూపొందించిన The Royals Review ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ సుమారు 40-45 నిమిషాల నిడివి కలిగి ఉంది.“ది రాయల్స్” కథ “మోర్ పూర్” అనే ఊరిలోని యువనాథ్ సింగ్ రాజవంశంపై ఆధారపడి ఉంది. రాజు యువనాథ్ సింగ్ మరణం తర్వాత, ఆయన భార్య పద్మజాదేవి, పెద్ద కుమారుడు అవిరాజ్ (ఇషాన్ ఖట్టర్), చిన్న కుమారుడు దిగ్విజయ్ (విహాన్ సమత్), మరియు కుమార్తె దివ్యరంజని (కావ్య టెహ్రాన్) కుటుంబాన్ని నడిపిస్తారు.అవిరాజ్ విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటాడు, కానీ బాధ్యతలతో అతనికి సంబంధం లేదు. దిగ్విజయ్ చెఫ్ కావాలని కోరికతో, దివ్యరంజని తన స్వభావంతో ప్రత్యేకంగా ఉంటుంది. రాజు యువనాథ్ సింగ్ మరణం తర్వాత, ఆయన రాసిన వీలునామాలో “మోరిస్” అనే వ్యక్తి పేరును చూడటం, ఆస్తుల పంపకాలు, అప్పులు వంటి అంశాలు కుటుంబాన్ని ఆందోళనకు గురిచేస్తాయి.
ఈ సమయంలో, వ్యాపార మహిళ సోఫియా (భూమి ఫెడ్నేకర్) వారి జీవితాల్లో ప్రవేశిస్తుంది. ఆమెతో డీల్ కుదుర్చుకుంటే, ప్యాలెస్ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు పొందవచ్చని చెప్పడంతో, కుటుంబం అంగీకరిస్తుంది.ఈ నేపథ్యంలో, అవిరాజ్ తన తండ్రి గురించి ఒక నిజాన్ని తెలుసుకుంటాడు. సోఫియాను ప్రేమిస్తున్న అతని జీవితంలో “ఆయేషా” అనే కొత్త వ్యక్తి ప్రవేశిస్తుంది. “మోరిస్” ఎవరో తెలుసుకోవడం, వ్యాపార పరంగా లక్ష్యాలను చేరుకోవడం వంటి అంశాలు కథను ఆసక్తికరంగా మార్చుతాయి.”ది రాయల్స్” కథ రాజవంశం, విలాసవంతమైన జీవితం, కుటుంబ సంబంధాలు, అక్రమ సంబంధాలు, ఆస్తుల పంపకాలు వంటి అంశాలను కలిగి ఉంది. ఇలాంటి నేపథ్యంతో గతంలో చాలానే సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. కానీ ఈ సిరీస్‌లో కథలో బలం కొంతవరకూ కనిపించదు.పాత్రలలో నైతిక విలువలు లేకుండా, ప్రతి పాత్ర తాత్కాలికంగా మారిపోతూ ఉంటుంది.
“గే”, “లెస్బియన్స్”, అక్రమ సంబంధాల అంశాలు కథలో ఉన్నాయి.ఈ అంశాలు చనిపోయిన రాజావారిని, బ్రతికున్న రాణివారిని కూడా ప్రభావితం చేస్తాయి.సిరీస్‌లో ప్యాలెస్ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఫొటోగ్రఫీ, నేపథ్య సంగీతం, ఎడిటింగ్, కాస్ట్యూమ్స్ వంటి అంశాలు బాగున్నాయి. కానీ స్క్రీన్‌ప్లేలో పట్టు కనిపించదు. పాత్రలలో విషయం తక్కువగా ఉంది.”ది రాయల్స్” ఒక రొమాంటిక్ కామెడీ సిరీస్‌గా రూపొందించినప్పటికీ, కథలో రొమాన్స్ తప్ప కామెడీ కనిపించదు. సన్నివేశాలు రొమాన్స్‌కు ముందు, తర్వాత అన్నట్లుగా సాగుతాయి. ఫ్యామిలీతో కాకుండా, సెపరేటుగా చూడవలసిన సిరీస్ ఇది.”ది రాయల్స్” ఒక విలాసవంతమైన రాజవంశం నేపథ్యంలో ప్రేమ, కుటుంబ సంబంధాలు, అక్రమ సంబంధాలు వంటి అంశాలను చర్చించే హిందీ వెబ్ సిరీస్. కథలో బలం కొంతవరకూ కనిపించకపోవడం, పాత్రలలో నైతిక విలువల కొరత వంటి అంశాలు ఉన్నాయి. కానీ ప్యాలెస్ నేపథ్యం, ఫొటోగ్రఫీ, సంగీతం వంటి అంశాలు ఆకర్షణీయంగా ఉన్నాయి.
Read Also : Bellankonda Srinivas : రాంగ్ రూట్‌లో కారు నడిపిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్