జీవితం అంటే సంతోషం, బాధ, ఆనందం, కష్టం అన్నీ కలగలిపి ఉండే అందమైన ప్రయాణం. ఎప్పుడూ నవ్వుతూ, సంతోషంగా గడపడం మాత్రమే జీవితం కాదు. బాధల్ని ఎదుర్కొన్నప్పుడు మాత్రమే సుఖం విలువ తెలుస్తుంది. అలానే పెళ్లి జీవితం కూడా కేవలం మొదటి మూడు నెలలు పరస్పరం విడిచి ఉండలేనంతగా ప్రేమతో గడపడం కాదు, మూడు దశాబ్దాలైనా అదే అనుబంధం, అదే ఆప్యాయత కొనసాగించడం నిజమైన మ్యారేజ్ లైఫ్ అందం. ఈ సింపుల్ కాన్సెప్ట్‌ను అందంగా చూపిస్తూ తెరకెక్కించిన చిత్రమే ‘సార్ మేడమ్’ (Sir Madam).మరీ ఈ సినిమా ఎలా ఉందొ రివ్యూ లో తెలుసుకుందాం.
కథ
ఆకాశవీరయ్య (విజయ్ సేతుపతి) తన ఊరిలోనే పెద్ద పరోటా మాస్టర్. ఒకటి రెండు కాదు రకరకాల పరోటాలు ట్రై చేస్తూ హోటల్ నడుపుతుంటాడు. ఇక పక్క ఊరిలో రాణి (నిత్యా మీనన్) అనే అమ్మాయిని వీరయ్య కోసం చూస్తారు. తొలి చూపులోనే ఆ అమ్మాయి ఇక రాణి కాదు మహారాణి.. అలానే జీవితాంతం చూసుకుంటా అంటూ వీరయ్య వీర లెవల్లో అందరిముందు చెబుతాడు. అయితే వీరయ్య ఫ్యామిలీ ఈ పెళ్లి సెట్ అవ్వాలని చిన్నచిన్న అబద్ధాలు ఆడతారు. 10వ తరగతి ఫెయిల్ అయిన వీరయ్య డబుల్ MA చేశాడని, లీజ్‌కి తీసుకొని ఉంటున్న ఇల్లు సొంతిల్లని.. ఇలా కొన్ని అబద్ధాలు ఆడతారు.అయితే వీరయ్య పరోటా రుచికి పడిపోయిన నిత్య పెళ్లికి ఓకే చెప్పేస్తుంది. దీంతో పెళ్లికి ముందే వెరైటీ వెరైటీ పరోటాలు తెచ్చి కాబోయే పెళ్లానికి ఇస్తూ ఉంటాడు. ఇంతలో వీరయ్య కుటుంబం బ్యాక్ గ్రౌండ్ తెలిసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తుంది రాణి ఫ్యామిలీ.

విశేషాలు
కానీ అప్పటికే వీరయ్యని ఇష్టపడటంతో కుటుంబం వద్దన్నా కూడా వెళ్లిపోయి రాణి పెళ్లి చేసుకుంటుంది. మొదటి మూడు నెలలు అంతా చాలా జాలీగానే నడుస్తుంది. అత్తమామలు, ఆడపడుచు అందరూ ఎంతో ప్రేమగా రాణిని చూసుకుంటారు. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. రాణిపై అత్త పెత్తనం, ఆడపడుచు సాధింపులు మొదలవుతాయి. హోటల్‌లో గల్లా పెట్టె దగ్గర రాణి కూర్చోవడంతో మొదలైన గొడవ చివరికి వీరయ్య.. రాణి అన్నయ్య గల్లాలు పట్టుకొని కొట్టునే వరకూ వెళ్తుంది. ఇద్దరూ విడిపోవడానికి డైవర్స్ నోటీసులు పంపేవరకూ వెళ్తుంది. మరి అంతలా గొడవ ఏం జరిగింది? వీరయ్య-రాణి జీవితంలో గొడవలు రావడానికి కారణాలేంటి? అసలు వీళ్లు విడిపోయారా? లేక కలిసారా? అనేదే మిగిలిన కథ.
‘సార్ మేడమ్’ సినిమా ఏ జానర్‌లో రూపొందింది?
ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా జానర్‌లో తెరకెక్కింది.
సినిమా టైటిల్ ‘సార్ మేడమ్’కి అర్థం ఏమిటి?
ఈ టైటిల్ భార్యాభర్తల మధ్య ఉన్న గౌరవాన్ని, ఒకరినొకరు అర్థం చేసుకునే బంధాన్ని సూచిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: NTR War 2 : యూకేలో ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ హంగామా : యుద్ధ ట్యాంకర్లతో ర్యాలీ