ప్రమోషన్ ప్రారంభమైన క్షణం నుంచి ‘ప్రేమంటే’ సినిమా (Premante Movie) కి యూత్‌లో ఒక పాజిటివ్ వైబ్ ఏర్పడింది. ప్రియదర్శి – ఆనంది కాంబినేషన్ మీదే కాకుండా,లియోన్ జేమ్స్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ఈ సినిమా పై బజ్ క్రియేట్ చేశాయి. పుస్కూర్ రామ్మోహన్‌రావు, జాన్వీ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also: The Raja Saab: ఎల్లుండి ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్
కథ
ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘ప్రేమంటే’ (Premante Movie) విడుదలైంది. మరి అందరి అంచనాలనూ ఈ సినిమా అందుకున్నదా? లేదా అనేది రివ్యూ లో చూద్దాం.అభిప్రాయాలు కలవక పెళ్లికి దూరంగా ఉంటున్న అమ్మాయి రమ్య(ఆనంది). సమస్యల కారణంగా పెళ్లి వద్దనుకుంటున్న అబ్బాయి మదన్మోహన్ అలియాస్ మది(ప్రియదర్శి). వీరిద్దరూ అనుకోకుండా ఓ పెళ్లిలో కలుస్తారు. వారి కలయిక ప్రేమగా, ఆ తర్వాత పెళ్లిగా పరిఢమిల్లుతుంది.
తొలి నెల వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగిపోతుంది. కానీ తర్వాత నుంచి కష్టాలు మొదలవుతాయి. బాధ్యతలు రమ్యను ఆఫీస్‌కు నడిపిస్తాయి. సమస్యలు మదిని వ్యాపారం వైపుకు తరలిస్తాయి. అసలు సమస్య ఇక్కడే వచ్చిపడుతుంది. సీసీ కెమెరాలు, లాక్స్ సంబంధించిన బిజినెస్ మదిది. దీనికి సంబంధించిన వర్కంతా నైటే ఎక్కువ ఉంటుంది.

కథనం
దాంతో రమ్య ఆఫీస్ నుంచి ఇంటికి రావడం.. అదే టైమ్‌కి మది తన ఆఫీస్ వెళ్లిపోవడం.. ఈ కారణంగా వారి వైవాహిక జీవితం అసంతృప్తిగా తయారవుతుంది. ఇదిలావుంటే.. ఇంట్లో ఉన్న కొద్ది సమయంలో మది కదలికలు రమ్యకు అనుమానం కలిగిస్తాయి. తాను ఎవరితోనే రిలేషన్‌లో ఉన్నాడనే సందేహం రమ్యకు మొదలవుతుంది. అందుకు తగ్గట్టు సాక్ష్యాలు కూడా కనిపిస్తుంటాయి. దాంతో మదిని నిలదీస్తుంది రమ్య.
ఇద్దరి మధ్య జరిగే గొడవలో అనుకోకుండా తన బిజినెస్‌కి సంబంధించిన రహస్యాన్ని బయటపెడతాడు మది. దాంతో రమ్య షాక్. అసలు మది చేస్తున్న బిజినెస్ ఏంటి? రమ్య ఎందుకు షాకయ్యింది? ఆ తర్వాత వీరిద్దరి వైవాహిక జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అసలు చివరికి ఏం జరిగింది? అనేది అసలు కథ.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: