हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Hridayapoorvam Movie: హృదయపూర్వం (జియో హాట్ స్టార్)మూవీ రివ్యూ

Anusha
Latest News: Hridayapoorvam Movie: హృదయపూర్వం (జియో హాట్ స్టార్)మూవీ రివ్యూ

మలయాళ సినీ ఇండస్ట్రీలో కుటుంబ చిత్రాలకు పర్యాయపదంగా నిలిచిన దర్శకుడు, సత్యన్ అంతికాడ్, – మోహన్‌లాల్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘హృదయపూర్వం’ (Hridayapoorvam) బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కేవలం రెండు వారాల వ్యవధిలోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

మోహన్‌లాల్ (Mohanlal)మరోసారి తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసాడు.మాళవిక మోహనన్ .. సంగీత మాధవన్ నాయర్ .. సంగీత్ ప్రతాప్ .. సిద్ధికీ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 26వ తేదీ నుంచి ‘జియో హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతోంది.మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

Lokha Chapter 2 : లోక చాప్టర్ 2 మూవీ అనౌన్స్‌మెంట్ పూర్తి వివరాలు

కథ

సందీప్ బాలకృష్ణన్ (మోహన్ లాల్) సిటీలో ఒక కిచెన్ సెంటర్ ను నిర్వహిస్తూ ఉంటాడు. తల్లీదండ్రులను కోల్పోయిన సందీప్, జీవితంలో ఒక తోడు అవసరమని భావిస్తాడు. అయితే పెళ్లికూతురు పారిపోవడంతో పీటలపై పెళ్లి ఆగిపోతుంది. అప్పటి నుంచి అతను పెళ్లి గురించిన ఆలోచన చేయడు. ఊహించనివిధంగా అతనికి హార్ట్ సర్జరీ జరుగుతుంది. పూణెకి చెందిన రవీంద్రనాథ్ అనే వ్యక్తి గుండెను సందీప్ కి అమర్చుతారు. 

సందీప్ పూర్తిగా కోలుకున్న తరువాత హాస్పిటల్ నుంచి తిరిగొస్తాడు. సందీప్ కోలుకోవడం అతని బావకి ఎంతమాత్రం ఇష్టం లేని విషయం. ఎందుకంటే ఊహించని విధంగా రేటు పెరిగిన ఆయన స్థలాలను సొంతం చేసుకోవాలనే ఆలోచనలో అతను ఉంటాడు. అలాంటి పరిస్థితులలో సందీప్ ను కలవడానికి హరిత (మాళవిక మోహనన్) వస్తుంది. సందీప్ కి అమర్చిన హార్ట్ తన తండ్రిదేనని చెబుతుంది. పూణెలో జరగనున్న తన ఎంగేజ్ మెంట్ కి రమ్మని ఆహ్వానిస్తుంది. 

Hridayapoorvam Movie
Hridayapoorvam Movie

కథనం

హాస్పిటల్ వారు తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను దగ్గరుండి చూసుకోవడానికిగాను, అసిస్టెంట్ గా ఇచ్చిన జెర్రీ (సందీప్ ప్రతాప్)ను వెంటబెట్టుకుని సందీప్ పూణె వెళతాడు. అక్కడే ఆయన మొదటిసారిగా రవీంద్రనాథ్ (Rabindranath) భార్యను చూస్తాడు. ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కాగానే వెంటనే బయల్దేరి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఊహించని విధంగా ఆ ఫంక్షన్ లో గొడవ జరుగుతుంది. అందుకు కారణం ఏమిటి? అప్పుడు సందీప్ ఏం చేస్తాడు?

అనేది మిగతా కథ. సాధారణంగా ఎవరైనా చనిపోతే, వారికి సంబంధించిన అవయవాలను అవి అవసరమైనవారికి అమర్చుతూ ఉంటారు. అయితే చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు, ఆ వ్యక్తి అవవయవాలను ఎవరికైతే అమర్చారో వారిని ఎంతగానో అభిమానించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ అవయవాలను పొందినవారికి, కొత్త వ్యక్తులు చూపించే ప్రేమాభిమానాలు చిత్రంగా అనిపిస్తూ ఉంటాయి.

విశ్లేషణ

అలాంటి ఒక ప్రధానమైన అంశం చుట్టూ తిరిగే కథ ఇది. ఈ కథలో చాలానే పాత్రలు కనిపిస్తాయి. ఆ పాత్రలు .. వాటి స్వభావాలు మన చుట్టూ ఉన్న వాస్తవ పరిస్థితులను పరిచయం చేస్తాయి. అయినవాళ్ల పేరుతో ఆస్తులు (assets) కాజేయాలనే పాత్రలు .. ప్రేమ పేరుతో మోసం చేసే పాత్రలు కనిపిస్తాయి. అయితే మంచి మనుషులకు మంచి ఫలితాలు దక్కుతాయి.

స్వార్థంతో ప్రవర్తించేవారికి అందుకు తగిన ప్రతిఫలాలే దక్కుతాయనేది దర్శకుడు చూపించిన విధానం బాగుంది. అయితే ఈ కథలో ఎక్కడా కూడా ట్విస్టులు ఉండవు. కథ చాలా నిదానంగా .. నింపాదిగా నడుస్తూ వెళుతుంది. జీవితానికి గల పరమార్థం ఏమిటంటే, మన చుట్టూ ఉన్నవారికి కొత్త జీవితాన్ని ఇవ్వడమే అనే సందేశం ఈ కథలో మనకి అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. సున్నితమైన భావోద్వేగలకు స్పందించే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువని చెప్పాలి. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870