రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు హైకోర్టులో (TG High Court) ఊరట లభించింది. ఈ రెండు సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు సంబంధించి నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పుష్ప-2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ-2 చిత్రాలకే వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది.
Read Also: Meenakshi Chaudhary : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్యా రాజేష్,మీనాక్షి చౌదరి

అడ్వాన్స్ బుకింగ్స్
ఇక సినిమా విడుదలల విషయానికి వస్తే, దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ జనవరి 12న విడుదల కానుంది. హైకోర్టు (TG High Court) ఆదేశాల నేపథ్యంలో ‘ది రాజా సాబ్’కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ బుధవారమే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టికెట్ ధరలపై స్పష్టత రావడంతో సంక్రాంతి బాక్సాఫీస్ వసూళ్లు భారీగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా చూస్తే, హైకోర్టు తాజా ఆదేశాలు సంక్రాంతి సినిమాలకు ఊరట కలిగించడమే కాకుండా, రాబోయే రోజుల్లో టాలీవుడ్ టికెట్ విధానాలపై కూడా కీలక ప్రభావం చూపే అంశంగా మారినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: