ఇప్పటికే పాత హిట్ చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ (Re-release) చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్‌గా అందించడంలో టాలీవుడ్ బిజీగా ఉంది. ‘పోకిరి’, ‘జల్సా’, ‘జగదేక వీరుడు’, ‘చెన్నకేశవరెడ్డి’ వంటివి మళ్లీ వెండితెరపై దుమ్ము రేపాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో పవర్ఫుల్ సినిమా జతకాబోతోంది – నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లక్ష్మీనరసింహా’ (‘Lakshminarasimha’) .బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) సందర్బంగా, జూన్ 8న ‘గోల్డెన్ టర్టెల్ ఎంటర్టైన్మెంట్స్’ ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా 2004లో మొదటిసారి విడుదలై భారీ విజయం అందుకుంది. మణిశర్మ అందించిన సంగీతం, మాస్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
అప్పట్లో కట్ అయిన పాటకు ఇప్పుడు చోటు
ఈసారి రీ రిలీజ్‌తో పాటు అభిమానులకు మరో అదనపు బహుమతిగా ఓ కొత్త పాటను జోడిస్తున్నారు. అప్పట్లో చిత్రీకరించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల సినిమాలో పెట్టనట్లైన ఓ పాటను ఇప్పుడు కలిపారు. బాలకృష్ణ పాత్రకు ప్రత్యేక హైలైట్‌గా నిలిచే ఈ పాటను ఇప్పుడు ప్రేక్షకులకు అందించనున్నారు.
చంద్రబోస్ లిరిక్స్, భీమ్స్ మ్యూజిక్…మరో స్పెషల్ హంగామా
పాత విజువల్స్ మాత్రమే అందుబాటులో ఉండటంతో, అవే ఫుటేజ్కి తగ్గట్టు కొత్తగా పాట రాయించారు. చంద్రబోస్ రాసిన ‘మందేసినోడు ఘనుడు’ అనే పాటకు యువ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, స్వరాగ్ కీర్తన్ ఆలపించారు. ఈ పాటను గురువారం విడుదల చేశారు.
జూన్ 8 నుంచి 18 వరకు థియేటర్లలో ప్రదర్శన
ఈ స్పెషల్ ఎడిషన్ సినిమా జూన్ 8 నుంచి 18 వరకూ ప్రదర్శించనున్నారు. అభిమానుల స్పందన బాగుంటే ప్రదర్శన కాలం మరింత పొడిగించే అవకాశం కూడా ఉంది. బాలయ్య ఫ్యాన్స్ కోసం ఇది నిజంగా ఓ ప్రత్యేక వేడుకే.ఫ్యాన్స్‌కి ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ ఇవ్వడంలో బాలకృష్ణ చిత్రబృందం ముందుండటం గర్వకారణం. ఈ రీ రిలీజ్‌తో పాటు కొత్త పాట ఒక జ్ఞాపకాన్ని తిరిగి తీసుకొస్తోంది. పాత గీతాల గోలలో కొత్త గానం కూడా ఫ్యాన్స్‌ను మత్తులో ముంచేస్తుందనడంలో సందేహమే లేదు.
Read Also : Ajith Kumar : హైపర్‌కార్ కొనుగోలు చేసిన అజిత్