हिन्दी | Epaper

Raviteja: ‘ఇరుముడి’ కీలక పాత్ర లో తమన్నా భాటియా?

Saritha
Raviteja: ‘ఇరుముడి’ కీలక పాత్ర లో తమన్నా భాటియా?

Raviteja: టాలీవుడ్‌లో ప్రత్యేకమైన మాస్ స్టైల్‌తో ప్రేక్షకులను అలరించే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ. చాలాకాలంగా సరైన హిట్టు కోసం చూస్తున్న రవితేజ ఇటీవల సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీతో ఓ మోస్తరు హిట్టు కొట్టి కాస్త ఉపశమనం పొందారు. మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది రవితేజ కెరీర్‌లో 77వ చిత్రం కావడం విశేషం. భక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ కలిసిన కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

Read Also: Harish Shankar: మహేశ్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన దర్శకుడు హరీశ్‌ శంకర్

Raviteja: ‘ఇరుముడి’ కీలక పాత్ర లో తమన్నా భాటియా?
Raviteja: Tamannaah Bhatia in a key role in ‘Irumudi’?

ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడి గెటప్‌లో కనిపిస్తూ చేతిలో ఇరుముడి పట్టుకుని కనిపించడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లుక్ చూసిన అభిమానులు సినిమా కథపై మరింత ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియాను (Tamannaah Bhatia) ఎంపిక చేసినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న తమన్నా మళ్లీ తెలుగులో ఒక ముఖ్యమైన పాత్రతో కనిపించబోతుందన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే రవితేజ, తమన్నా కాంబినేషన్ మరోసారి తెరపై కనిపించనుండటం విశేషం. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కోకాపేటలో అల్లు సినిమాస్ ని ప్రారంభించిన సీఎం

కోకాపేటలో అల్లు సినిమాస్ ని ప్రారంభించిన సీఎం

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

8 ఏళ్లు భరించా, ఇక సహించను- రష్మిక మందన్న సంచలన హెచ్చరిక

శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

నటనపై తరచూ ట్రోల్స్ వస్తున్నాయి

‘ధురంధర్-2’ నుంచి ‘ఆరి ఆరి’ పాట‌ విడుద‌ల‌
2:44

‘ధురంధర్-2’ నుంచి ‘ఆరి ఆరి’ పాట‌ విడుద‌ల‌

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

రాజేంద్ర ప్రసాద్‌పై నటుడు విశాల్ సీరియస్

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

మోసాలిసా పెళ్లి పై డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’!

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

బాయ్‌ఫ్రెండ్‌తో మోనాలిసా జంప్, పోలీసుల వద్ద ఆశ్రయం

‘బలగం’ హీరోయిన్‌తో కాలభైరవ పెళ్లి?

‘బలగం’ హీరోయిన్‌తో కాలభైరవ పెళ్లి?

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

📢 For Advertisement Booking: 98481 12870