నాలుగు భాషల్లో అందుబాటులోకి మాస్ ఎంటర్‌టైనర్; థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయిన చిత్రం ఎనర్జిటిక్ స్టార్ రవితేజ(Raviteja) మరియు యువ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
Read Also: Ram Potheneni: ఆంధ్రా కింగ్ తాలూకా’: నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల!

అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. థియేటర్లలో చూడలేని ప్రేక్షకుల కోసం ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. రవితేజ(Raviteja) మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీలీల డ్యాన్స్‌తో కూడిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను ఇంట్లో కూర్చుని చూసే అవకాశం నవంబర్ 28 నుంచి ప్రేక్షకులకు లభించనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: