రష్మిక (Rashmika Mandanna) నటించిన మూవీ’ ది గర్ల్ ఫ్రెండ్’. అందాల రాక్షసి సినిమాతో హీరోగా మెప్పించి, చిలసౌ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించాడు.. నవంబర్ 07న థియేటర్లలో విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది.
డిసెంబర్ 05 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి రూ. 28 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా ఎలా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. దీంతో చాలా మంది అమ్మాయిలు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ఓన్ చేసుకున్నారు.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రష్మిక (Rashmika Mandanna)సినిమా స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. డిసెంబర్ 05 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.
రష్మిక మందన్నా మొదటి సినిమా ఏది?
రష్మిక మందన్నా తొలి సినిమా ‘కిరిక్ పార్టీ’ (2016). ఇది కన్నడలో విడుదలై ఆమెకు భారీ గుర్తింపు తీసుకొచ్చింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: