అఖిల్ రాజ్, తేజస్విని రావ్ జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju weds rambai) చిత్రం విడుదలైన మొదటి రోజే ఆశ్చర్యకరమైన ఆదరణను సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతున్న ఈ సినిమా, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 1.47 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి మంచి ఓపెనింగ్‌ను నమోదు చేసింది. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ అంచనాలకు మించి కలెక్షన్లు రావడం విశేషం.
Read Also: Akhanda 2: ‘అఖండ 2’ ట్రైలర్ విడుదల

పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న రూరల్ లవ్ స్టోరీ
హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ విడుదల సమయంలోనే మంచి బజ్ సృష్టించడంతో, సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ రిపోర్ట్స్(Raju weds rambai) రావడం కలెక్షన్లపై ప్రభావం చూపింది.అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం, ఈ సినిమా ‘లిటిల్ హార్ట్స్’ ఫస్ట్ డే వసూళ్లైన రూ.1.35 కోట్లను దాటిందని మేకర్స్ తెలిపారు. దీంతో ‘రూరల్ కల్ట్ బ్లాక్‌బస్టర్’గా ప్రకటించారు.
స్క్రీన్స్ పెరిగిన ‘రాజు వెడ్స్ రాంబాయి’
మౌత్ టాక్ బాగుండటంతో శనివారం నుంచే అదనంగా 100కిపైగా స్క్రీన్లు జోడించినట్లు నిర్మాతలు తెలిపారు. అదే రోజు విడుదలైన ప్రియదర్శి ‘ప్రేమంటే’, అల్లరి నరేష్ ‘12ఏ రైల్వే కాలనీ’ వంటి చిత్రాలు పోటీలో ఉన్నా… ‘రాజు వెడ్స్ రాంబాయి’కి డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా, వేణు ఊడుగుల మరియు రాహుల్ మోపిదేవి నిర్మించారు. శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనిత చౌదరి వంటి పలువురు నటులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. సంగీతం సురేష్ బొబ్బిలి అందించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: