తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తూ, ప్రేక్షకులను అద్భుతమైన కథనాలతో ఆకట్టుకుంటూ వస్తోన్న సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రస్తుతం ‘కూలీ’ అనే భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకోగా, ఈ చిత్రం 2025 ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది.

రూ.400 కోట్ల బడ్జెట్ – రజనీ రెమ్యునరేషన్ కీలకం
‘కూలీ’ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లకు చేరుకోవడానికి ప్రధాన కారణం రజనీకాంత్ తీసుకున్న భారీ పారితోషికం అని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం రజనీకాంత్ దాదాపు రూ.260 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇది దేశంలో ఒక నటుడికి లభించిన అత్యధిక పారితోషికాల్లో ఒకటిగా నిలిచింది. ఇది కేవలం ఒక నటుడి రెమ్యునరేషన్‌కే సంబంధించి పెట్టుబడి కేటాయించడం అన్నది అరుదైన విషయం.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్
ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో విక్రమ్, ఖైదీ, మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనశైలితో రజనీతో కలిసి పనిచేస్తుండటంతో, ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఓ క్యామియో రోల్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా కూలీ సినిమా ఆర్టిస్టుల పారితోషికం వెల్లడైంది. ఈ సినిమాకు రజనీకాంత్ 260 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ‘కేజీఎఫ్’ సినిమా బడ్జెట్ 80 కోట్లు. అంటే రజనీ రెమ్యునరేషన్ తో ఏకంగా మూడు కేజీఎఫ్ సినిమాలు చేయచ్చన్న మాట. ఇక ఇదే సినిమా కోసం డైరెక్టర్ లోకేష్ దాదాపు 60 కోట్ల రూపాయల పారితోషికం అందుకోనున్నారని టాక్.
72 సంవత్సరాలు అయినా స్టార్ పవర్ తగ్గలేదు!
రజనీకాంత్ వయస్సు ప్రస్తుతం 72 సంవత్సరాలు. అయినప్పటికీ ఆయన మార్కెట్ విలువ, ప్రేక్షకుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో రజనీకాంత్ ముందంజలో ఉన్నారు. గతంలో దళపతి విజయ్ ఒక సినిమాకు రూ.275 కోట్లు రెమ్యునరేషన్ పొందినట్లు వార్తలు వచ్చినా, రజనీకాంత్ రెమ్యునరేషన్ దానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది.
Read also: Good Bad Ugly: ఓటీటీలోకి గుడ్ బ్యాడ్ అగ్లీ..ఆదాయంలో రికార్డ్