భారతీయ సినీ పరిశ్రమలో అత్యున్నత నటుడిగా నిలిచిన సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. అనేక విభిన్న పాత్రలతో, సామాజిక స్పృహ కలిగిన సినిమాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఆయన ఈ ప్రయాణం, అభిమానులకు గర్వకారణంగా మారింది.
చంద్రబాబు శుభాకాంక్షలు
రజనీకాంత్ (Rajinikanth) సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
“సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి 50 అద్భుతమైన సినీ సంవత్సరాలు పూర్తి చేసినందుకు హృదయపూర్వక అభినందనలు. ఆయన సినిమాలు సమాజంపై విశేష ప్రభావం చూపించాయి. ఆయన్ని చూసి లక్షలాది మంది ప్రేరణ పొందారు” అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
రజనీ స్పందన
చంద్రబాబు శుభాకాంక్షలకు రజనీకాంత్ హృదయపూర్వకంగా స్పందించారు.
“గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ మాటలు నా మనసును తాకాయి. నాకు మరింత ఉత్సాహం, ప్రేరణను కలిగించాయి. మీ ప్రేమ, మద్ధతుకు ధన్యవాదాలు” అని రజనీకాంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రధాని మోదీ సందేశం
సూపర్ స్టార్ మైలురాయిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
“రజనీకాంత్ గారి సినీ ప్రయాణం అత్యంత ప్రభావవంతమైనది. ఆయన పోషించిన పాత్రలు కోట్లాది అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు.
మోదీకి రజనీ థ్యాంక్స్
ప్రధాని శుభాకాంక్షలకు కూడా రజనీకాంత్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. “మీ అభినందనలు నాకు ఎంతో ప్రేరణనిచ్చాయి. మీ మద్దతుతో ముందుకు ఇంకా బలంగా సాగుతాను” అని ఆయన రిప్లై ఇచ్చారు.
అభిమానుల హర్షం
ఈ సందర్భంగా సినీ అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు రజనీకాంత్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశాల వర్షం కురిపిస్తున్నారు. 50 ఏళ్ల నిరంతర కృషితో ‘థలైవా’ సాధించిన ఈ ఘనత దక్షిణ భారతీయ సినీ చరిత్రలో ఓ అపూర్వ మైలురాయిగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: