“రజినీకాంత్” అనే పేరు వినగానే లక్షలాది అభిమానుల హృదయాల్లో ఓ ప్రత్యేక ఉత్సాహం అలుముకుంటుంది. ఆయన నడకలో స్టైల్, కాల్ ఎగరేయడంలో స్టైల్, సిగరెట్ గాల్లోకి ఎగరేయడంలో స్టైల్ – ఇలా ఆయన ఏం చేసినా అది ఒక స్టైలే. బస్ కండక్టర్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే స్థాయికి చేరుకోవడం ఆయన కృషి, పట్టుదల, ప్రత్యేకమైన వ్యక్తిత్వానికి నిదర్శనం.రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. కర్ణాటకలో జన్మించిన ఆయన బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేస్తూనే నటనపై ఆసక్తిని పెంచుకున్నారు. ఈ క్రమంలో మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (Madras Film Institute) లో శిక్షణ పొందారు. అదే సమయంలో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ఆయన ప్రతిభను గుర్తించి ‘అపూర్వ రాగంగళ్’ (1975, ఆగస్టు 15) చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన శ్రీవిద్య భర్తగా, జయసుధ తండ్రిగా కనిపించారు. ఆ చిన్న పాత్రే ఆయన సినీ ప్రస్థానానికి బలమైన పునాది వేసింది.
స్టైల్ కింగ్ – మాస్ & క్లాస్ కలయిక
రజినీకాంత్ కెరీర్‌లో ఆయన ప్రత్యేకమైన నటన శైలి ప్రధాన ఆకర్షణ. శరీర భాష, డైలాగ్ డెలివరీ, మాస్ అప్పీల్, క్లాస్ టచ్ – ఇవన్నీ కలిపి ఆయనను ఒక ప్రత్యేకమైన నటుడిగా నిలిపాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయనకు ఉన్న మాంత్రిక శక్తే ఆయన విజయానికి కారణం. యాక్షన్ సీన్లలో ప్రత్యర్థులను ఉతికి ఆరేయగలిగిన రజినీ (Rajinikanth), హాస్యాన్ని కూడా అద్భుతంగా పండించగలరు. ఈ విభిన్నతే ఆయనకు కోట్లాది అభిమానులను తెచ్చింది.1970ల చివరి నుండి 1980ల దశకంలో రజినీకాంత్ తమిళ సినీ పరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగారు. ‘బైరవి’, ‘బిల్లా’, ‘అన్నమలై’, ‘బాషా’, ‘పడయప్ప’, ‘శివాజీ’, ‘ఎంతిరన్’, ‘కబాలి’, ‘కాలా’, ‘జైలర్’ వంటి చిత్రాలు ఆయన అభిమానులను ఉర్రూతలూగించాయి. ప్రతి సినిమా వేరే తరహాలో ఆయన ప్రతిభను ప్రదర్శించింది.
50 ఏళ్ల సినీ ప్రయాణం
సినీ ఇండస్ట్రీలో ఐదు దశాబ్దాల సినీ కెరీర్‌ని పూర్తి చేసుకున్న రజినీకాంత్‌కి ఎంతో ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రజినీకి శుభాకాంక్షలు తెలపడం విశేషం. ‘ సినీ ప్రపంచంలో 50 అద్భుతమైన సంవత్సరాలను పూర్తిచేసుకున్న రజనీకాంత్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన సినీ ప్రయాణం ప్రతిష్టాత్మకంగా నిలిచింది. కొన్ని దశాబ్దాలుగా ఆయన పోషించిన విభిన్నమైన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. భవిష్యత్తులోనూ ఆయన్ని మరిన్ని విజయాలు సాధించాలని, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ మోదీ ఇంగ్లీషుతో పాటు తమిళ భాషలోనూ ట్వీట్ చేశారు.
రజినీకాంత్ సినీ కెరీర్ ఎప్పుడు మొదలైంది?
ఆయన 1975లో “అపూర్వ రాగంగళ్” సినిమాతో తామిళ్ సినిమాల్లో అడుగుపెట్టారు.
రజినీకాంత్ ప్రత్యేకత ఏమిటి?
జినీకాంత్ ప్రత్యేక స్టైల్, మాస్స్ అప్పీల్, యాక్షన్, హాస్య ప్రతిభ కలిగి ఉంటారు. సిగరెట్ గాల్లోకి ఎగరేసే స్టైల్, నడిలో సొంతమైన హావభావాలు ఆయనకి ప్రసిద్ధి తెచ్చాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: