తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఈరోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేసిన ఆయన, ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపానికి చేరుకున్న రజనీకాంత్ (Rajinikanth) కుటుంబానికి వేద పండితులు వేదాశీర్వచనాలు అందించారు.
Read Also: మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!
పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు
టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. రజనీకాంత్ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.శుక్రవారం (డిసెంబర్ 12)తో 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెట్టిన రజినీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ప్రత్యేకతగా మారింది. కలియుగ దైవమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని రజినీకాంత్ తరుచూ దర్శించుకుంటూనే ఉంటారు.

తన జీవితంలో వివిధ సందర్బాలు, శుభకార్యాలు ఉన్న సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు. రజినీకాంత్ పుట్టినరోజు సందర్బంగా సినీ సెలబ్రెటీలే కాదు, సామాన్య ప్రేక్షకులూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వయస్సు పెరిగినా ఆయనలోని ఎనర్జీ, డిసిప్లిన్ చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం రజనీకి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: