సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మంచి మనసును చాటుకున్నారు. తమిళనాడులోని మధురైలో శేఖర్ అనే వ్యక్తి.. పరోటా షాప్ నడుపుతున్నాడు. గత 13 ఏళ్ల నుంచి కేవలం 5 రుపాయలకే పరోటా అమ్ముతున్నాడు. గతంలో ఇతడికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇతని పేరు శేఖర్ అయినప్పటికీ అందరూ రజనీకాంత్ శేఖర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇతను సూపర్ స్టార్ కు వీరాభిమాని. ఈ క్రమంలోనే తాజాగా రజనీ నుంచి శేఖర్ కుటుంబానికి పిలుపు వచ్చింది. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా శేఖర్ ను ఇంటికి ఆహ్వానించిన రజనీకాంత్.. అతనికి బంగారు చెయిన్ బహుమతిగా ఇచ్చారు.
Read Also: Patang Movie: ఓటీటీలోకి ‘పతంగ్’ ఎప్పుడంటే?
కొత్త సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో
ఇక సినిమాల విషయానికొస్తే, రజనీకాంత్ (Rajinikanth)ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చిత్రం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు, తన తదుపరి చిత్రం గురించిన కీలక అప్‌డేట్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే పొంగల్ పండుగ సందర్భంగా తన ఇంటి వద్దకు వచ్చిన అభిమానులతో మాట్లాడుతూ, సిబి చక్రవర్తి దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని స్వయంగా వెల్లడించారు. ఇది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: