స్టార్ హీరో నితిన్, స్టార్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘రాబిన్ హుడ్’ ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కించగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే అంతర్జాతీయ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఓ కీలక పాత్రలో నటించడం. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయర్‌గా మాత్రమే కాకుండా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వార్నర్ ఇప్పుడు వెండితెర మీద కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు.

వివాదాస్పద వ్యాఖ్యలు
ఈనెల 28న థియేటర్లలో సందడి చేయనున్న రాబిన్ హుడ్, భారీ అంచనాలతో ముందుకు వెళుతోంది. దీంతో మేకర్స్ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటీనటులతో పాటు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా హాజరయ్యారు. అయితే, ఈ వేడుకలో రాజేంద్రప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ దొంగ ము కొడుకు.. వీడు మామూలోడు కాదండిఅంటూ వార్నర్ గురించి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక, వార్నర్ నవ్వుతూ కనిపించాడు.ఈ కామెంట్స్ తీవ్ర విమర్శల పాలవుతున్న నేపథ్యంలో, రాజేంద్రప్రసాద్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఐ లవ్ వార్నర్ ఐ లవ్ క్రికెట్ వార్నర్ మా సినిమాలను, నటనను ఇష్టపడతాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనుకోకుండా నోటి నుంచి మాటలు వచ్చిపోయాయి. ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. వార్నర్ పై అనుకోకుండా నోటి నుంచి మాట దొర్లింది. అది ఉద్దేశ్య పూర్వకంగా మాట్లాడింది కాదు. మేమంతా ఒకరికొకరం క్లోజ్ అయిపోయాం. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ తెలిపారు. ఎవరైనా బాధపడితే క్షమించండి. ఇకపై ఇలాంటి మాటలు అనకుండా చూసుకుంటాను అని స్పష్టీకరించారు. ఇక, ఈ వివరణ తర్వాత వివాదానికి తెరపడిందని భావిస్తున్నారు. కానీ, కొన్ని నెటిజన్లు మాత్రం రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు అనవసరం అంటూ కామెంట్స్ పెడుతుండటం గమనార్హం. రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నితిన్, శ్రీలీల కెమిస్ట్రీ, వెంకీ కుడుముల మార్క్ ఎంటర్టైన్మెంట్, డేవిడ్ వార్నర్ స్పెషల్ అప్పీరియెన్స్ – ఇవన్నీ కలిపి ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.