ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. రాజ్-డీకే కాంబినేషన్‌లో వచ్చిన ఈ స్పై యాక్షన్ డ్రామా,ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని, అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది.ఇప్పుడు ఈ సిరీస్ మూడో భాగం విడుదలకు సిద్ధం ఉంది.
Read Also: Keerthy Suresh: AI మార్ఫింగ్ చిత్రాలపై కీర్తి సురేష్ ఆవేదన

ప్రమోషన్లతో సిరీస్‌పై భారీ హైప్
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3 ’ శుక్రవారం (నవంబర్ 21) నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.ఈ సిరీస్‌లో సమంత (Samantha), నిమ్రత్ కౌర్‌ల నటన గురించి ఆయన మాట్లాడుతూ,
“ఈ సిరీస్ కోసం మేము రాసిన పాత్రలు మొదట ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు. సమంత (Samantha) అయినా, నిమ్రత్ కౌర్ అయినా తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. నిజానికి వారి పాత్రలు చేయడం చాలా తేలిక. అయినప్పటికీ వాళ్లు ఎంతో కష్టపడి ఆ పాత్రల్లో జీవించారు” అని పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: