స్టార్ హీరోయిన్ సమంత(Samantha) తన అభిమానులను ఆశ్చర్యపరచుతూ దర్శకుడు రాజ్ నిడిమోరుతో రెండో వివాహం(Raj Nidimoru) చేసుకున్నారు. కోయంబత్తూరులోని లింగ భైరవి ఆలయంలో ఈ వివాహ వేడుక చాలా సాదాసీదాగా జరిగింది. కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో హాజరయ్యారు. సమంత ఎర్రటి చీరలో మెరిసిపోగా, ఈ వేడుకపై సోషల్ మీడియాలో ఊహాగానాలు క్రమంగా వచ్చినా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేస్తూ వివాహం జరిగినది అని అధికారికంగా ప్రకటించారు.
Read also: భూత శుద్ధి పద్దతిలో వివాహం చేసుకున్న సమంత

రాజ్ నిడిమోరు: ఇంజనీరింగ్ నుండి సినీ దర్శకుడు
రాజ్ నిడిమోరు(Raj Nidimoru) 1975లో తిరుపతిలో పుట్టారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన ఆయన, తన సినీ ఆసక్తి కోసం ఉద్యోగాన్ని వదిలి, ‘రాజ్ & డీకే’ టీమ్‌లో సినీ రంగంలో అడుగుపెట్టారు. ‘గో గోవా గాన్’, ‘స్త్రీ’, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి సినిమాలు ఆయన విజయవంతమైన ప్రాజెక్ట్స్.
మీడియా అంచనాల ప్రకారం, రాజ్ ఆస్తి విలువ సుమారు రూ. 83–85 కోట్లు ఉంటుందని చెప్పబడుతుంది, సమంత ఆస్తి విలువ రూ. 100-110 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఇది ఇద్దరికీ రెండో వివాహం. సమంత 2017లో నాగచైతన్యతో వివాహం చేసుకుని 2021లో విడాకులు తీసుకున్నారు. రాజ్ తన మొదటి భార్యతో 2022లో విడాకులు చేసుకున్నారు. కొత్త జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: