బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటతో ఆస్కార్ గెలుచుకొని (Winning an Oscar) అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన తన ప్రేయసి హరిణి రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుక హైదరాబాదులో అత్యంత సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా జరిగింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు
ఎంగేజ్మెంట్ (Engagement) కార్యక్రమం గురించి అధికారికంగా రాహుల్ (Rahul Sipligunj) లేదా ఆయన కుటుంబం ఎలాంటి ప్రకటన చేయకపోయినా, వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. రాహుల్ సాధారణంగా ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే వ్యక్తి అయినప్పటికీ, ఇంత ముఖ్యమైన జీవిత ఘట్టాన్ని రహస్యంగా ఉంచడం నెటిజన్లలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
కలర్ఫుల్గా మెరిసిన జంట
ఎంగేజ్మెంట్ వేడుకలో రాహుల్–హరిణి రెడ్డి జంట ఆకట్టుకునే విధంగా మెరిసిపోయారు. కలర్‌ఫుల్ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో వీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. నిశ్చితార్థ ఫొటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు రాహుల్ సిప్లిగంజ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హరిణి రెడ్డి వివరాలపై ఆసక్తి
రాహుల్ ప్రేయసి హరిణి రెడ్డి గురించి పూర్తి సమాచారం ఇంకా బయటకు రాలేదు. ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువైంది. ఇక పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన కోసం రాహుల్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఆస్కార్ గెలిచిన గాయకుడికి సీఎం గిఫ్ట్
రాహుల్ సిప్లిగంజ్ పేరు నాటు నాటు పాటతో దేశవ్యాప్తంగా మార్మోగింది. ఆ పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో తెలంగాణ గర్వకారణంగా నిలిచాడు. ఆ సందర్భంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ప్రత్యేకంగా కోటి రూపాయల చెక్కు అందించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: