సినీ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ (Prakash Raj) తరచూ తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ చర్చనీయాంశమవుతుంటారు. తాజాగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. “జస్ట్ ఆస్కింగ్” అనే ట్యాగ్‌లైన్‌తో పెట్టిన ఈ ట్వీట్, రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తావిస్తోంది.
“మహాప్రభూ.. ఓ చిలిపి సందేహం”
తన ట్వీట్‌ను ప్రారంభిస్తూ ప్రకాశ్ రాజ్, “మహాప్రభూ, ఓ చిలిపి సందేహం” అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే కొత్త బిల్లును (new bill to introduced) ఉద్దేశిస్తూ, దాని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందా అనే ప్రశ్నను లేవనెత్తారు. “మీ మాట వినని మాజీ లేదా ప్రస్తుత ముఖ్యమంత్రిని అరెస్టు చేసి, మీకు నచ్చిన ఉప ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టే యోజన ఏదైనా ఉందా?” అని ఆయన నిలదీశారు.

ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో ఎక్కడా రాష్ట్రం పేరు గానీ, వ్యక్తుల పేర్లు గానీ ప్రస్తావించలేదు. కానీ “మాజీ సీఎం”, “ప్రస్తుత సీఎం”, “డిప్యూటీ సీఎం” అనే పదజాలం వాడటంతో ఆయన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను సూచిస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ట్వీట్‌తో ఆయన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టమవుతోంది.
ఏపీ రాజకీయ సమీకరణాలపై దృష్టి
ఈ ట్వీట్ వెలువడిన వెంటనే రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు దీనిని ఏపీ సన్నివేశానికి అన్వయిస్తున్నారు. మాజీ సీఎం జగన్, ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను పరోక్షంగా ఉద్దేశించారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రకాశ్ రాజ్ ట్వీట్ ఏపీలో వేడెక్కుతున్న రాజకీయ చర్చలకు మరింత ఊపిరి పోసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: