తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో యూత్ ఆడియెన్స్‌లో, ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్, (Pradeep Ranganathan) నటిస్తున్న చిత్రం లవ్ ఇన్సురెన్స్ కంపెనీ (Love Insurance Kompany). ఈ సినిమాకు నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. అయితే ఎవరూ ఊహించని విధంగా రిలీజ్ వాయిదా పడింది.. మూవీ త్వరలోనే విడుదల కానుందని యూఎస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
Read Also: SP Balasubrahmanyam: రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ

ఫిబ్రవరి, 2026 రిలీజ్ చేసేందుకు ప్లాన్
అయితే కొత్త తేదీ ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. తాజా టాక్ ప్రకారం ఈ మూవీని వాలెంటైన్ వీక్‌లో (ఫిబ్రవరి, 2026) రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై ఎస్ ఎస్ లలిత్ కుమార్‌తో కలిసి నయనతార నిర్మిస్తుంది. ఈ చిత్రంలో (Pradeep Ranganathan) ఎస్‌జే సూర్య, కృతి శెట్టి, యోగి బాబు, సీమాన్, గౌరీ కిషన్, షారా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: