పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ప్రాజెక్టులలో “స్పిరిట్”(Spirit Movie)కి ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ లైన్ అప్ లో చాలా సినిమాలు ఉన్న ఫ్యాన్స్ మాత్రం స్పిరిట్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. “అర్జున్ రెడ్డి”తో తెలుగులో, “యానిమల్”తో హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచానాలు ఉన్నాయి.
Read Also: Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మాస్ సాంగ్ రిలీజ్!

“స్పిరిట్”పై క్రేజ్
ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారట. ఇంతవరకూ ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించకపోవడం, అందులోనూ సందీప్ వంగా డైరెక్షన్ కావడంతో “స్పిరిట్”పై క్రేజ్ మరింతగా పెరిగింది.అయితే, ప్రభాస్ అభిమానులు ‘స్పిరిట్’ సినిమా అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
సందీప్ వంగ దర్శకత్వంలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలో మెక్సికోలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు VFX, భారీ సెట్స్ అవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అప్పుడే, విడుదల తేదీని కూడా ప్రకటిస్తారట.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: