పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కి కూడా పండగే. ప్రభాస్ ఈసారి అభిమానుల కోసం హారర్, ఎంటర్‌టైన్‌మెంట్ కథాంశంతో ‘ది రాజాసాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలు, ట్రైలర్ అందర్ని ఆకట్టుకోవడంతో సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఫాంటసీ హారర్ కామెడీగా రూపొందిన ‘ది రాజాసాబ్’ ఎలా ఉంది? ప్రభాస్ అభిమానులను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయా? లేదా సమీక్షలో తెలుసుకుందాం.
Read Also: Toxic Review : యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?
కథ
రాజాసాబ్‌కు (ప్రభాస్) (Prabhas) నాన్నమ్మ గంగా దేవి (జరీనా వహాబ్) అంటే ప్రాణం. ఆమెతో కలిసి ఉంటూ, ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. వయసు రీత్యా గంగా దేవి అల్జీమర్స్ (మతిమరుపు వ్యాధి)తో బాధపడుతుంటుంది. గంగమ్మ తనకు సంబంధించిన విషయాలు మరిచిపోయినా తన భర్త కనకరాజును (సంజయ్‌దత్) మాత్రం మరిచిపోదు. ఎప్పటికైనా తాతను తీసుకరమ్మని మనవడిని కోరుతుంది. అనుకోకుండా ఓసారి ఓఫోటోలో కనిపించిన కనకరాజును వెతుక్కుంటూ హైదరాబాద్ బయలుదేరుతాడు రాజాసాబ్.
కానీ కనకరాజ్ తన మాయాలతో నాన్నమ్మ, మనవడిని నర్సాపూర్ అడవిలోని తన భవంతికి రప్పించుకుంటాడు. అంతేకాదు ఇద్దరిని అంతమెందించాలని ప్రయత్నిస్తాడు. అసలు రాజాసాబ్ ఎవరు? కనకరాజ్ ఎందుకు రాజాసాబ్, గంగాదేవిని చంపాలనుకుంటాడు? గంగాదేవికి రాజవంశానికి ఉన్న సంబంధమేమిటి? రాజాసాబ్ ముగ్గురమ్మాయిలు భైరవి (మాళవిక మెహనన్), బ్లెస్సీ (నిధి అగర్వాల్) అనిత (రిద్దికుమార్)లను ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? కథను ముందుకు నడిపించడంలో వీరి పాత్రలు ఎలా ఉపయోగపడ్డాయి? చివరకు కథ ఎలా ముగిసింది? అనేది మిగతా కథ.

కథనం
ఈ సినిమా కథంతా నర్సాపూర్ ఫారెస్ట్‌లోని కోట చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ షాట్‌లోనే కనకరాజుకి డబ్బంటే ఎంత పిచ్చో చెప్పేశాడు దర్శకుడు మారుతి. పరుల సొమ్ము కోసం ఆశపడే కనకరాజు తన మాయాజాలంతో అందరి నుంచి డబ్బులు దోచుకుని దాన్ని కోటలో దాచుకోవడం, చనిపోయిన తర్వాత కూడా ఆ సొమ్మంతా తనకే దక్కాలని, ఆ సంపదకు వారసుడు తాను మాత్రమేనని, ఇంకెవరికీ దక్కకూడదని ముందే వీలునామా రాసుకోవడం వంటి ఘటనలు ఆసక్తి రేపుతాయి.
సెకండాఫ్‌లో సంజయ్ దత్‌కి ప్రభాస్ ఎదురుపడినప్పటి నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. వాళ్ల మధ్య మైండ్ గేమ్‌తో పాటు ప్రభాస్ కామెడీ టైమింగ్ కొత్తగా అనిపిస్తుంది. చనిపోయి ఆత్మగా మారిన తర్వాత కూడా తన భార్యని చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడన్నది ఉత్కంఠని కలిగిస్తుంది. నిజానికి రాజాసాబ్ దమ్మున్న కథే.. ప్రతి దమ్మున్న కథకి హీరో అంటే కథ, కథనమే. ఎంత పెద్ద కథానాయకుడ్నైనా నిలబెట్టేది కథే. కానీ ఈ సినిమాలో ప్రభాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని అనవసరమైన సన్నివేషాలతో అసలు కథని గాడి తప్పించారు దర్శకుడు మారుతి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: