ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ముందుగా ఆయన నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. రాజా సాబ్ విడుదలైన వెంటనే ప్రభాస్ కల్కి 2 షూటింగ్‌లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధమవుతున్నట్లు టాక్. విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లిన చిత్రం గా నిలిచింది.
Read Also: Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు?
ఫిబ్రవరిలో కల్కి-2 షూటింగ్
గతేడాది జూన్‌లో రిలీజైన కల్కి ₹1100 కోట్ల కలెక్షన్లు సాధించింది. మొదటి భాగం ముగిసిన విధానం చూసిన ప్రేక్షకులు రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల నుంచి కల్కి 2 షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ముఖ్యంగా ఈ పార్ట్‌లో కమల్ హాసన్, ప్రభాస్ మధ్య జరిగే యుద్ధం కీలకంగా ఉండబోతుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎపిక్ వార్ సీక్వెన్స్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

దీనికోసం ప్రత్యేకంగా సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్‌పై భారీగా ఖర్చు చేయనున్నారని సమాచారం.ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ షూటింగ్‌లో ఉన్న ప్రభాస్, కల్కి 2 ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని స్పిరిట్‌కు కొద్ది రోజుల బ్రేక్ ఇచ్చి, నాగ్ అశ్విన్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని సమాచారం. దీనికి సందీప్ రెడ్డి వంగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.న్యూఇయర్ సందర్భంగా స్పిరిట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రావచ్చని టాక్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: