పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి తన క్రేజ్‌ను విదేశాల్లో నిరూపించాడు. జపాన్‌లో జరిగిన ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రభాస్, అక్కడ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ హాజరయ్యారు. అక్కడ వీరికి ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Shahrukh Khan: దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాకు అరుదైన గౌరవం
సరికొత్త లుక్
జపాన్‌లో అమరేంద్ర బాహుబలి అంటూ చిత్ర బృందం కొన్ని ఫోటోలను ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇందులో ప్రభాస్ (Prabhas) ట్రెండీ కాస్ట్యూమ్స్ లో, సరికొత్త లుక్ లో అలరించారు. అలానే జపనీస్ లో అందరినీ విష్ చేసి ఆకట్టుకున్నారు.
ఇప్పటివరకు చూడని స్టైలిష్ అవతారంలో కనిపించిన డార్లింగ్, జపాన్ అభిమానులను మాత్రమే కాదు, ఇండియన్ సినీ లవర్స్‌ని కూడా షాక్‌కి గురి చేశారు. ప్రభాస్ తాజా లుక్ చూసిన అభిమానులు.. ఈ లుక్ స్పిరిట్‌ది అయి ఉంటుందేమో అని అంటున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: